
కోలీవుడ్ యంగ్ హీరో వేమల్ నటించిన SIR సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ విడుదలైంది. బోస్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వేమల్‌తో పాటు ఛాయా దేవి కన్నన్, శరవణన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సాంఘిక డ్రామాగా ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్‌ఎస్ పిక్చర్స్ పతాకంపై సిరాజ్ నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్ కుమార్ అందించారు.

ఎస్‌ఐఆర్ (SIR) చిత్రం నుంచి తాజాగా విడుదలైన సాంగ్ కోలీవుడ్‌లో భారీగా వైరల్ అవుతుంది. దానికి ప్రధాన కారణం జీవీ ప్రకాశ్, ఆయన మాజీ సతీమణి సైంధవి అని చెప్పవచ్చు. వీరిద్దరు కొద్దిరోజుల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసింది. ఆ సమయంలో వారిపై భారీగా ట్రోల్స్ వచ్చాయి. కానీ, వాటిని సున్నితంగానే ఇద్దరూ తప్పుపట్టారు. అయితే, విడాకులు తీసుకున్న తర్వాత జీవీ ప్రకాశ్, సైంధవి కలిసి ఎస్‌ఐఆర్ (SIR) సినిమా కోసం ఒక పాటకోసం తమ గొంతు కలిపారు. వారిద్దరూ కలిసి పాడిన ఆ సాంగ్ ఇప్పడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. 2025లో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.

ఈ ఏడాది మే నెలలో సైంధవి, జీవీ ప్రకాశ్ విడిపోతున్నట్లు తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఆ సమయంలో ప్రకాశ్ ఇలా చెప్పాడు 'మేము విడిపోవడానికి గల కారణాన్ని మా కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేశాం. అన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. దయచేసి మా ఇద్దరి భావోద్వేగాలను గౌరవించండి. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని రాసుకొచ్చారు. కాగా.. జీవీ ప్రకాశ్, సైంధవి 11 ఏళ్ల తమ వివాబహాబంధానికి గుడ్ బై చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment