Music Director TS Muralidharan Passed Away: సంగీత దర్శకుడు మురళీధరన్‌ కన్నుమూత - Sakshi
Sakshi News home page

విషాదం: సంగీత దర్శకుడు మురళీధరన్‌ కన్నుమూత

Jul 19 2021 3:19 PM | Updated on Jul 19 2021 4:29 PM

Music director TS Muralidharan passes away - Sakshi

కోలివుడ్‌  పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఔత్సాహిక సంగీత  దర్శకుడు టీఎస్‌ మురళీ ధరన్‌ కన్నుమూశారు.  ఆదివారం (జూలై,18) చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

సాక్షి,ముంబై:  కోలివుడ్‌  పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఔత్సాహిక సంగీత  దర్శకుడు టీఎస్‌ మురళీ ధరన్‌ కన్నుమూశారు.  ఆదివారం (జూలై,18) చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబం, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రతిభావంతుడైన  మురళి అకస్మిక మరణంపై పలువురు పరిశ్రమ పెద్దలు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'శ్రీ' తో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మురళి  తెరంగేట్రం చేశారు. ఈ  సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా రాణించకపోయినా, సంగీత దర్శకుడిగా పలువురి అభిమానాన్ని సంపాదించుకున్నారు.  అఖిల్ గౌరవ్ సింగ్ దర్శకత్వం లో వచ్చిన 'గూడం' అనే హిందీ చిత్రానికి సంగీతం అందించారు మురళి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement