
ప్రస్తుతం తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే కచ్చితంగా ఉండే పేరు తమన్.

తమన్ అలియాస్ ఘంటసాల సాయిశ్రీనివాస్ తమన్ శివకుమార్. ఈ రోజు (నవంబర్ 16) పుట్టినరోజు.

తమన్ గురించి అందరికీ తెలిసినవి కాకుండా ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం.

నెల్లూరులో పుట్టిన తమన్.. చెన్నైలో పెరిగాడు. తండ్రి అశోక్ డ్రమ్మర్, తల్లి సావిత్రి సింగర్.

పేరెంట్స్ వల్ల చిన్నప్పటి నుంచే సంగీతం బాగా దగ్గరైపోయింది. ఓసారి తండ్రి డ్రమ్ కొనివ్వడంతో ఇష్టం పెరిగిపోయింది.

13 ఏళ్ల వయసులో 'భైరవద్వీపం' సినిమాకు తమన్ డ్రమ్మర్‌గా చేస్తే రూ.30 పారితోషికం ఇచ్చారు.

ఇది జరిగిన కొన్నాళ్లకే తండ్రి చనిపోవడంతో ఆరో తరగతి మధ్యలోనే చదువు ఆపేసి, షోలు చేయడం మొదలుపెట్టాడు.

తమన్ తండ్రి మరణంతో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇతడికి సాయం చేశారు. షోలు చేసే ఛాన్స్ ఇచ్చారు.

అలా నాలుగేళ్లలో దాదాపు 4 వేల స్టేజ్ షోలు చేశాడు. మధ్యలో 'బాయ్స్' సినిమాలోనూ డ్రమ్స్ వాయించే కుర్రాడిగా నటించాడు.

మణిశర్మ దగ్గర 'ఒక్కడు' కోసం పనిచేయడం తన జీవితాన్ని మార్చేసిందని తమన్ ఎప్పుడూ చెప్పేమాట.

తమన్‌కు 24 ఏళ్లు వచ్చేసరికీ 64 మంది సంగీత దర్శకులతో 900 సినిమాలకు పనిచేయడం విశేషం.

24 ఏళ్ల వయసులో సంగీత దర్శకుడిగా తమిళ సినిమాలో తొలి ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత రవితేజ 'కిక్'తో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చాడు.

బృందావనం, దూకుడు, బిజినెస్‌మెన్, రేసుగుర్రం.. ఇలా అతి తక్కువ కాలంలోనే 72 సినిమాలకు సంగీతం అందించారు.

ఎన్టీఆర్ 'అరవింద సమేత'.. తమన్‌కు 100వ సినిమా. కెరీర్‌లో హిట్స్‌తో పాటు ఫ్లాప్స్ కూడా చాలానే ఎదుర్కొన్నాడు.

ప్రస్తుతం తమన్.. పుష్ప 2, గేమ్ ఛేంజర్ లాంటి పాన్ ఇండియా మూవీస్‌కి పనిచేశాడు. త్వరలో ఇవి రిలీజ్ కానున్నాయి.

తమన్ భార్య శ్రీ వర్దిని కూడా సింగరే. కాకపోతే తమన్ సినిమాల్లో ఆమె పాడటం గగనమనే చెప్పాలి.

సంగీత దర్శకుడిగానే తమన్ అందరికీ తెలుసు. కానీ ఇతడిలో సిక్సులు కొట్టే క్రికెటర్ కూడా ఉన్నాడండోయ్.



