![Star Music Director Deactivated His Instagram Account Because Fans Troll - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/04/18/youn.jpg.webp?itok=7ezqsvUC)
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘విజిల్ పోడు..’ అనే పాట లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేశారు మేకర్స్. మదన్ కర్కే లిరిక్స్ అందించిన ఈ పాటను విజయ్, వెంకట్‌ప్రభు, యువన్ శంకర్ రాజా, ప్రేమ్‌గీ ఆలపించారు. అయితే ఈ సాంగ్ వల్ల మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా దారుణమైన ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నాడు.
యూట్యూబ్‌లో విజిల్ పోడు పాటను మిలియన్ల కొద్ది ప్రేక్షకులు చూశారు. సోషల్ మీడియాలో కూడా ఈ పాటకు మంచి ఆదరణ లభించినప్పటికీ, కొందరి నుంచి నెగటివ్ కామెంట్లు వచ్చాయి. పాటలో మ్యూజిక్ పరమచెత్తగా ఉందని యువన్ శంకర్ రాజాపై దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా అనిరుద్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ పాటపై విమర్శలు గుప్పిస్తున్నారని అంటున్నారు. అనిరుధ్‌ను పొగుడుతూ యువన్‌ను తక్కవ చేసి కామెట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వారందరూ కూడా యువన్ శంకర్ రాజాను ట్యాగ్ చేసి కామెంట్ చేస్తున్నారు. దీంతో ఆందోళన చెందిన యువన్ శంకర్ రాజా ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుంచి తప్పుకున్నారు. తన అకౌంట్‌ను తొలగించేశారు.
కొందరి అభిమానుల వల్లే యువన్ శంకర్ రాజా ఈ నిర్ణయం తీసుకున్నారని యువన్ ఫ్యాన్స్ పోస్ట్ చేశారు. అంతే కాకుండా విజిల్ పోడు పాట విజయ్ పార్టీ ఎన్నికల ప్రచార గీతమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. యువన్ నుంచి ఇలాంటి పాట వస్తుందని ఊహించలేదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతలో, యువన్ శంకర్ రాజా తన ఎక్స్ పేజీలో ఒక కామెంట్ చేశారు. 'నా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సాంకేతిక లోపం కారణంగా, నా పోస్ట్‌లు తొలగించబడ్డాయి. అభిమానుల ఆందోళన చెందాల్సిన పనిలేదు. ధన్యవాదాలు, నేను నా ఇన్‌స్టాగ్రామ్ పేజీని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను' అంటూ వివాదానికి ముగింపు పలికారు. ప్రస్తుతం అయితే యువన్ శంకర్ రాజా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వినియోగంలో లేదు.
Comments
Please login to add a commentAdd a comment