
సినీ ఇండస్ట్రీలో మరో జంట విడాకులు ప్రకటించింది. తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ షాకింగ్ ప్రకటన చేశారు.

తన భార్య.. సింగర్ సైంధవితో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు

మరోవైపు సైంధవి కూడా తనవైపు నుంచి అధికారికంగా ప్రకటించారు

‘చాలా ఆలోచించిన తర్వాత ‘సైంధవి, నేను 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాం.

మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగుకోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.

ఇలాంటి కీలక తరుణంలో మా గోప్యతకు భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం.


















