'అమెరికాలో పూనకాలు లోడింగ్'.. మెగాస్టార్ ట్వీట్ వైరల్! | Megastar Chiranjeevi All the Best To Devi Sri Prasad Team Events In USA | Sakshi
Sakshi News home page

Chiranjeevi:'అమెరికాలో పూనకాలు లోడింగ్'.. మెగాస్టార్ ట్వీట్ వైరల్!

Published Sat, Jun 10 2023 8:01 PM | Last Updated on Sat, Jun 10 2023 8:05 PM

Megastar Chiranjeevi All the Best To Devi Sri Prasad Team Events In USA - Sakshi

డీఎస్పీ అనగానే ఠక్కున గుర్తొచ్చేది పేరు దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే తన మ్యూజిక్‌తో ఆడియన్స్‌ను ఊర్రూతలూగించడం ఆయన టాలెంట్‌. టాలీవుడ్‌లో మెగాస్టార్ నుంచి యంగ్ హీరోల సినిమాల దాకా తన మ్యూజిక్‌తో అభిమానులను అలరించాడు. అందుకే టాలీవుడ్‌లో అతన్ని ముద్దుగా డీఎస్పీ అని పిలుస్తారు. అయితే తాజాగా తన టాలెంట్‌ను అమెరికాలో ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు డీఎస్పీ. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి డీఎస్పీ బృందానికి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు.  'అమెరికాలో పూనకాలు లోడింగ్'  అంటూ ఓ వీడియోనూ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 
(ఇది చదవండి: ప్రేమికుల రోజున సీనియర్‌ హీరోకి అదితి ప్రపోజ్‌! సిద్ధార్థ్‌ రియాక్షన్‌ ఇదే..)

అమెరికాలోని నాసా ఆధ్వర్యంలో నిర్వహించే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ కన్సర్ట్‌కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా మెగాస్టార్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. నాసా అధ‍్వర్యంలో  దేవి శ్రీ ప్రసాద్‌తో మ్యూజిక్ కన్సర్ట్స్ నిర్వహించనున్నారు. జులై 2న డల్లాస్, జులై 8న ఫిలడెల్ఫియా, జులై 15న సియాటెల్, జులై 22న సాన్ జొస్ , జులై 29న చికాగోలో ఈవెంట్స్ జరగనున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్స్‌లో సింగర్ ఇంద్రవతి , సాగర్, గీతా మాధురి , హేమ చంద్ర , రీటా , పృథ్వి , మౌనిక అలరించనున్నారు. ప్రముఖ యాంకర్ నటి అనసూయ ఈ షోస్‌ను హోస్ట్ చేయనున్నారు.

గతంలో నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ ఆర్ఆర్ఆర్ సినిమా  ‘నాటు నాటు’ పాటకు 150 టెస్లా కార్లతో లైట్ షో నిర్వహించడం వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే.  టీజీ విశ్వప్రసాద్ గారి అధ్వర్యంలో నాసా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ  సంయుక్తంగా నిర్వహించారు. ఇటీవలే  సింగర్ రామ్ మిరియాలతో పలు చోట్ల మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు.  ఈ షోస్ కి ఊహించని రీతిలో అనూహ్య స్పందన లభించింది. 

(ఇది చదవండి: సిద్ధార్థ్- ఆదితి డేటింగ్‌.. అసలు విషయం చెప్పేసిన హీరో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement