పంజాబ్‌కు చెందిన జస్లీన్ రాయల్.. సింగర్, సాంగ్ రైటర్, కంపోజర్‌గా తనదైన ప్రతిభ చాటుకుంటోంది. పంజాబీ, హిందీ, బెంగాలీ, గుజరాతీలతో పాటు ఇంగ్లీష్‌లోనూ పాటలు పాడింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అందుకున్న తొలి మహిళా మ్యూజిక్ డైరెక్టర్‌గా చరిత్ర సృష్టించింది. లుథియానాలో హైస్కూల్ చదువు పూర్తయిన తరువాత పై చదువుల కోసం దిల్లీ వచ్చింది జస్లీన్. హిందూ కాలేజ్‌లో బి.కామ్ పూర్తి చేసింది. సంగీతంలో ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు జస్లీన్.
తాను సెల్ఫ్–టాట్ ఆర్టిస్ట్. ఒకే టైమ్‌లో వివిధ రకాల మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను ప్లే చేయడం తన ప్రత్యేకత. పిల్లలకు సంగీత పాఠాలు చెప్పడం వల్ల పాకెట్ మనీ కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడే అవసరం ఉండేది కాదు. ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ ఫస్ట్ సీజన్‌లో సెమీ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా అందరి దృష్టిని ఆకర్షించింది జస్లీన్. తన సంగీత ప్రతిభతో ‘వన్ ఉమెన్ బ్యాండ్’గా పేరు తెచ్చుకుంది.
‘బాలీవుడ్‌లోకి రావాలనేది నా చిన్నప్పటి కల. అయితే అది అంత సులభంగా నెరవేరలేదు. ఇక వెనక్కి వెళ్లిపోదాం అనుకునే సందర్భాలు అందరిలాగే నాకూ ఎదురయ్యాయి. పరీక్ష సమయంలో గట్టిగా నిలబడితే విజయం మన సొంతం అవుతుంది. నా విషయంలోనూ అదే జరిగింది’ అంటున్న జస్లీన్ రాయల్ రకరకాల ప్రాజెక్ట్‌లతో ముంబైలో బిజీబిజీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment