
తన నేపథ్య సంగీతంతో చిత్రాలకు ప్రాణం పోస్తున్నారనే ప్రశంసలను యువ సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ అందుకుంటున్నారు. విజయ్ సేతుపతి నటించిన విక్రమ్ వేదా చిత్రంతో చిత్ర పరిశ్రమ దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు శ్యామ్. ఆ తరువాత అడంగు మరు, అయోగ్య, ఖైదీ వంటి పలు విజయవంతమైన చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం సంగీత దర్శకుడుగా మరింత బిజీ అయ్యారు.
తాజాగా దర్శకుడు సెల్వరాఘవన్, కీర్తి సురేష్ కలిసి నటించిన సాని కాయితం(తెలుగులో చిన్ని) చిత్రానికి ఈయన అందించిన పాటలు, నేపథ్య సంగీతానికి సినీ వర్గాల నుంచి, సంగీత ప్రియుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఈ మూవీ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది.
చదవండి: ఆడియన్స్‌కు మూవీ టీం విజ్ఞప్తి.. ‘దయచేసి అలా చేయకండి’
Comments
Please login to add a commentAdd a comment