విక్టరీ వినోదం  | Venkatesh Daggubati teams up with Anil Ravipudi for the third time | Sakshi
Sakshi News home page

విక్టరీ వినోదం 

Published Wed, Apr 10 2024 12:01 AM | Last Updated on Wed, Apr 10 2024 12:01 AM

Venkatesh Daggubati teams up with Anil Ravipudi for the third time - Sakshi

‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ (ఈ చిత్రాల్లో వరుణ్‌ తేజ్‌ మరో హీరో) చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్‌–దర్శకుడు అనిల్‌ రావిపూడిల కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి, 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు.

‘‘వెంకటేశ్‌గారితో మూడోసారి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తో ఆరోసారి, భీమ్స్‌తో తొలిసారి.. 2025 సంక్రాంతికి ‘విక్టరీ వినోదం’తో కలుద్దాం’’ అని ఈ సినిమా గురించి ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఓ మాజీ పోలీస్‌ ఆఫీసర్, అతని మాజీ ప్రేయసి, అతని భార్య... ఈ ముగ్గురి పాత్రల చుట్టూ సాగే క్రైమ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని ఈ చిత్రం యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement