ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. మరోవైపు ఐపీఎల్‌లో ఈసారి హైదరాబాద్ జట్టు దంచికొట్టే ఫెర్ఫార్మెన్స్ ఇస్తోంది. దీంతో జనాలు దృష్టి క్రికెట్ పైకి మళ్లింది. ఈ క్రమంలోనే థియేటర్లకు ప్రేక్షకులు రావడమే తగ్గించేశారు. ఈ క్రమంలోనే మొన్నీమధ్య ఓ సినిమా ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి కొన్ని కామెంట్స్ చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారమే రేపాయి. ఇప్పుడు వాటిపై మళ్లీ ఈయనే క్లారిటీ ఇచ్చేశాడు.
(ఇదీ చదవండి: నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్)
రీసెంట్‌గా 'కృష్ణమ్మ' సినిమా ఈవెంట్‌కి హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి.. 'ఐపీఎల్ చూడకపోతే కొంపలేం మునిగిపోవు. సాయంత్రం థియేటర్లకు వచ్చి మూవీస్ చూడండి' అని కాస్త ఘాటుగానే చెప్పాడు. దీంతో సినిమాల కంటే ఐపీఎల్ బెస్ట్, సినిమాలు చూడకపోయినా కొంపలేం మునిగిపోవు అని నెటిజన్స్ రిటర్న్ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో తాజాగా మరో కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ రావిపూడి.. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూనే అసలేం జరిగిందో చెప్పుకొచ్చాడు.
'మే 19న డైరెక్టర్స్ డే వేడుకలు చేస్తున్నాం. ఆ రోజు కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉంది. నేను ఈ మధ్య ఐపీఎల్ గురించి మాట్లాడిన మాటలు మరో రకంగా జనాల్లోకి వెళ్లాయి. నేను ఆ ఈవెంట్ కి వెళ్లే ముందు ఓ డిస్ట్రిబ్యూటర్‌ని కలిశాను. వేసవిలో ఐపీఎల్ వల్ల కూడా సినిమాలు సరిగా ఆడట్లేదని చెప్తే ఆ ఫ్లోలో అలా మాట్లాడేశాను. ఐపీఎల్ చూడండి. సినిమాలు కూడా చూడండి. నేనూ ఐపీఎల్ చూస్తా. నేను మాట్లాడింది అపార్థం చేసుకోవద్దు' అని అనిల్ రావిపూడి.. వివాదాస్పద కామెంట్స్‌కి పుల్‌స్టాప్ పెట్టేశాడు.
(ఇదీ చదవండి: ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి)
Comments
Please login to add a commentAdd a comment