వెంకటేశ్‌కి జోడీగా... | Meenakshi Chaudhary opposite Venkatesh | Sakshi
Sakshi News home page

వెంకటేశ్‌కి జోడీగా...

Published Mon, Mar 4 2024 1:30 AM | Last Updated on Mon, Mar 4 2024 1:30 AM

Meenakshi Chaudhary opposite Venkatesh - Sakshi

హీరోయిన్‌గా మీనాక్షీ చౌదరి ప్రస్తుతం ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. తమిళ హీరో విజయ్‌ ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’, వరుణ్‌ తేజ్‌ ‘మట్కా’, దుల్కర్‌ సల్మాన్‌ ‘లక్కీ భాస్కర్‌’, విశ్వక్‌ సేన్‌ పదో చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు ఈ యంగ్‌ బ్యూటీ. కాగా మీనాక్షీకి హీరోయిన్‌గా మరో సూపర్‌ చాన్స్‌ వచ్చిందని టాక్‌. ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్‌–దర్శకుడు అనిల్‌ రావిపూడిల కాంబినేషన్‌లో ఓ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ తెరకెక్కనుందనే టాక్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను ‘దిల్‌’ రాజు నిర్మించనున్నారని సమాచారం. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత త్రిష పేరు వినిపించింది. తాజాగా మీనాక్షీ చౌదరి పేరు తెరపైకి వచ్చింది. వెంకీ వంటి స్టార్‌ హీరో సినిమా కాబట్టి మీనాక్షీ కూడా ఆల్మోస్ట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసినట్టేనని అంటున్నారు ఫిల్మ్‌నగర్‌ వాసులు. ఇక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారని, ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్‌ పరిశీలిస్తోందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఇంకా.. కథ రీత్యా ఇందులో ఓ గెస్ట్‌ రోల్‌ ఉందని, ఈ పాత్రలో రవితేజ లేదా బాలకృష్ణ కనిపిస్తారని భోగట్టా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement