కథ విన్నారా? | Venkatesh New Movie Updates | Sakshi
Sakshi News home page

కథ విన్నారా?

Published Mon, Jul 1 2024 1:59 AM | Last Updated on Mon, Jul 1 2024 2:01 AM

Venkatesh New Movie Updates

హీరో వెంకటేష్‌ నుంచి మరో కొత్త సినిమా కబురు వినే సమయం ఆసన్నమైందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం ‘రానా నాయుడు’ అనే వెబ్‌సిరీస్‌ నెక్ట్స్‌ సీజన్స్ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు వెంకటేష్‌. ఈ సిరీస్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించనున్న సినిమా సెట్స్‌లో ఆయన జాయిన్  అవుతారని తెలుస్తోంది.

కాగా ‘సామజవరగమన’ వంటి హిట్‌ మూవీకి రైటింగ్‌ టీమ్‌లో పనిచేసిన నందు అనే వ్యక్తి ఓ కథను వెంకటేష్‌కి వినిపించడంతో, ఆయన సానుకూలంగా స్పందించారట. దీంతో ఈ కథకు తుది మెరుగులు దిద్ది మళ్లీ వెంకటేష్‌కి వినిపించనున్నారట నందు. అన్నీ కుదరితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement