
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తారు. ఓ మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, ఆ పోలీసాఫీసర్ మాజీ ప్రేయసి... ప్రధానంగా ఈ మూడు పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ యూనిట్ ప్రకటించింది. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను జూలై చివర్లో లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ షూటింగ్‌తో వెంకటేశ్ బిజీగా ఉన్నారని సమాచారం. ఈ సిరీస్ చిత్రీకరణ పూర్తయ్యాక అనిల్ రావిపూడి డైరెక్షన్‌లోని సినిమా సెట్స్‌లోకి వెంకటేశ్ ఎంట్రీ ఇస్తారని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment