ముహూర్తం కుదిరింది venkatesh and anil ravipudi combination upcoming movie updates | Sakshi
Sakshi News home page

ముహూర్తం కుదిరింది

Published Fri, Jun 28 2024 12:16 AM | Last Updated on Fri, Jun 28 2024 11:51 AM

venkatesh and anil ravipudi combination upcoming movie updates

‘ఎఫ్‌ 2, ఎఫ్‌ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, ఆ పోలీసాఫీసర్‌ మాజీ ప్రేయసి... ఈ మూడు ప్రధాన పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ఇది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను అధికారికంగా వెల్లడించి, వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు.

కానీ ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్‌ వర్క్స్‌ను పూర్తి చేశారట దర్శకుడు అనిల్‌ రావిపూడి. మరోవైపు ‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌లో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశారట వెంకటేశ్‌. దీంతో వెంకటేశ్‌–అనిల్‌ల కాంబినేషన్‌లోని సినిమా ప్రారంభోత్సవానికి జూలై మొదటివారంలో ముహూర్తం కుదిరిందని తెలిసింది. అదే నెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్లాన్‌ చేశారని టాక్‌. అలాగే ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి ఓ హీరోయిన్‌గా నటించనున్నారని సమాచారం. ఈ సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement