తమిళసినిమా: ఆడవారిని విమర్శలతో బాధించడం నీచమైన చర్యగా నటి మెహ్రిన్ పేర్కొంది. ఈ బ్యూటీ తెలుగులో నానీకి జంటగా కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంలో కథానాయకిగా పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. తమిళం, హిందీ భాషల్లోనూ కథానాయకిగా నటించిన మెహ్రిన్‌కి ఇప్పటికీ స్టార్ ఇమేజ్ రాలేదని చెప్పాలి.
అంతేకాదు ప్రస్తుతం అవకాశాలు కూడా తగ్గిపోయాయి. తమిళంలో నెంజిల్ తునివిరిందాల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత ధనుష్‌కు జంటగా పటాస్, విజయ్ దేవరకొండ సరసన నోటా చిత్రాల్లో ఆ తర్వాత ఇక్కడ అవకాశాలు రాలేదు. అలాంటిది ప్రస్తుతం స్పార్క్ అనే చిత్రంలో నటిస్తోంది. కాగా సినిమా అవకాశాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ అమ్మడు కూడా వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సీరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ పలు విమర్శలను ఎదుర్కొంటోంది.
ముఖ్యంగా మెహ్రిన్ బెడ్ రూమ్ సన్నివేశాల్లో హద్దు మీరి ఉందంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. అశ్లీల సన్నివేశాలలో బరితెగించి నటించింది అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి విమర్శలపై స్పందించిన మెహ్రిన్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సీరీస్‌లో చోటుచేసుకున్న మానభంగం సన్నివేశంలో అశ్లీలంగా నటించాలని తనపై విమర్శలు గుర్తిస్తున్నారని ఇది తనను ఎంతగానో బాధకు గురిచేస్తోందని పేర్కొంది.
ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలనే ఆ వెబ్ సీరీస్‌లో చూపించినట్లు చెప్పింది అయితే తనను చాలా నీచంగా చిత్రీకరించి ట్రోలింగ్ చేయడం బాధిస్తోందని పేర్కొంది. విమర్శలు చేసే వారికి అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని ఆడవారిని బాధించడం వారిపై రాక్షసంగా ప్రవర్తించడం హేయమైన చర్య అనే భావనను మెహ్రిన్ వ్యక్తం చేసింది.
Recently I made my OTT Debut in the web series, “Sultan of Delhi” on Disney Hotstar. I hope my fans have enjoyed watching the series. Sometimes scripts demand certain actions which might go against your own morals. As a professional actor who considers acting an art and at the…
— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) October 17, 2023
Comments
Please login to add a commentAdd a comment