
ఇటీవలే ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమా విజయోత్సవం సందర్భంగా అనంతపురానికి వచ్చా. ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలు మరవలేనివి.’’ అని హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా అన్నారు. నగరంలోని సుభాష్‌రోడ్డులోనూతనంగా ఏర్పాటుచేసిన సెల్ పాయింట్ మొబైల్స్ షాపీని శుక్రవారం ఆమె ప్రారంభించారు.
అనంతపురం కల్చరల్: అనంతపురం నగరంలో సినీనటి మెహరిన్ ఫిర్జాదా సందడి చేసింది. సుభాష్‌రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సెల్‌పాయింట్‌ను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనంత ఆదరాభిమానాలు మరవలేనివని అన్నారు. ఇటీవలే తాను ‘కష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమా విజయోత్సవం సందర్భంగా అనంతపురం వచ్చానని గుర్తు చేసుకున్నారు. నెల రోజుల కిందట అనంత లోనే సెల్‌పాయింట్‌ను ప్రారంభించానని ఇక్కడి ప్రజల సమక్షంలో మరోసారి ప్రారంభోత్సవానికి రావడం ఆనందంగా ఉందన్నారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉన్న మొబైల్స్ షాపీని ఆదరించాలన్నారు. అనంతరం సంస్థ ఎండీ మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ సెల్‌ఫోన్లు నిత్యావసర వస్తువులుగా మారిపోతున్న తరుణంలో అందరికీ అందుబాటులో ఉండేవిధంగా భారీ ఆఫర్లను ఏర్పాటు చేశామన్నారు.
అభిమానుల సందడి
సినీనటి మెహరిన్ ‘అనంత ’కు వస్తోందని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సెల్‌పాయింట్ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. అందరూ ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఎగబడటంతో వారిని అదుపుచేయడానికి పోలీసులు ఇబ్బంది పడ్డారు.