Cell Point
-
సెల్ దుకాణంలో అగ్నిప్రమాదం
బద్వేలు అర్బన్ : స్థానిక సిద్దవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్‌లో ఉన్న ఖలందర్ సెల్ పాయింట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. రోజూ మాదిరే శనివారం రాత్రి దుకాణం మూసివేసి వెళ్లగా.. ఆదివారం ఉదయం దుకాణంలో నుంచి దట్టమైన పొగలు వస్తుండడంతో స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని వారు సెల్పాయింట్ యజమాని షాజహాన్‌కు, అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని షెట్టర్ తెరచి చూడగా దుకాణంలోని ఏసీ నుంచి మంటలు వస్తుండటాన్ని గుర్తించి సీవోటు యంత్రం ద్వారా అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దుకాణంలోని సెల్ఫోన్లు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపకాధికారి ఓబులేసు తెలిపారు. -
'అనంత 'వీర ప్రేమ గాథ
ఇటీవలే ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమా విజయోత్సవం సందర్భంగా అనంతపురానికి వచ్చా. ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలు మరవలేనివి.’’ అని హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా అన్నారు. నగరంలోని సుభాష్రోడ్డులోనూతనంగా ఏర్పాటుచేసిన సెల్ పాయింట్ మొబైల్స్ షాపీని శుక్రవారం ఆమె ప్రారంభించారు. అనంతపురం కల్చరల్: అనంతపురం నగరంలో సినీనటి మెహరిన్ ఫిర్జాదా సందడి చేసింది. సుభాష్‌రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సెల్‌పాయింట్‌ను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనంత ఆదరాభిమానాలు మరవలేనివని అన్నారు. ఇటీవలే తాను ‘కష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమా విజయోత్సవం సందర్భంగా అనంతపురం వచ్చానని గుర్తు చేసుకున్నారు. నెల రోజుల కిందట అనంత లోనే సెల్‌పాయింట్‌ను ప్రారంభించానని ఇక్కడి ప్రజల సమక్షంలో మరోసారి ప్రారంభోత్సవానికి రావడం ఆనందంగా ఉందన్నారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉన్న మొబైల్స్ షాపీని ఆదరించాలన్నారు. అనంతరం సంస్థ ఎండీ మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ సెల్ఫోన్లు నిత్యావసర వస్తువులుగా మారిపోతున్న తరుణంలో అందరికీ అందుబాటులో ఉండేవిధంగా భారీ ఆఫర్లను ఏర్పాటు చేశామన్నారు. అభిమానుల సందడి సినీనటి మెహరిన్ ‘అనంత ’కు వస్తోందని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సెల్పాయింట్ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. అందరూ ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఎగబడటంతో వారిని అదుపుచేయడానికి పోలీసులు ఇబ్బంది పడ్డారు. -
సెల్‌ఫోన్ దుకాణంలో అగ్ని ప్రమాదం
అనంతపురం సెంట్రల్ : అనంతపురం కమలానగర్లో గురువారం మధ్యాహ్నం ఓ సెల్‌ఫోన్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. షాపులోని మొత్తం ఫర్నీచర్లు, సెల్ఫోన్లు కాలిబూడదయ్యాయి. కమలానగర్లో డీసీఎంఎస్ రోడ్డులో రామానాయుడు అనే వ్యక్తి ఇండియన్ మొబైల్స్ షాపు నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం 2 గంటలకు భోజనానికి ఇంటికివెళ్లారు ఆ సమయంలో షాపులో షార్టు సర్కూ్యట్తో మంటలు వ్యాపించాయి. షాపులో నుంచి పొగలు రావడంతో స్థానికులు ఫైరింజన్‌కు సమాచారం అందించారు. వారొచ్చే సరికే విలువైన సెల్ఫోన్లు, ఫర్నీచర్ అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.6.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని అగ్నిమాపక అధికారి లింగమయ్య తెలిపారు. -
సెల్‌పాయింట్‌లో ఆఫర్ల వెల్లువ
విశాఖపట్నం సిటీ : సెల్పాయింట్ 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 20 రోజులుగా వినియోగదారులకు ఇస్తున్న ప్రత్యేక ఆఫర్లు దీపావళితో ముగియనున్నాయి. ఆధునిక మోడళ్లతో సెల్పాయింట్ షోరూమ్‌లు కళకళలాడుతున్నాయి. భారీ డిస్కౌంట్లతో పాటు కాంబో, జోడీ ఆఫర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా సెల్పాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ మోహన్‌ప్రసాద్ పాండే మాట్లాడుతూ మొబైల్ కొనుగోలుదారులకు బంపర్ బహుమతుల కింద 10 మందికి మలేషియా ఫారిన్ ట్రిప్, ఐదుగురికి స్కూటీ పెప్స్లను డ్రా ద్వారా అందజేయనున్నట్టు తెలిపారు. తమ షోరూమ్స్‌లో శామ్సంగ్, సోనీ, నోకియా, కార్బన్, సెల్కాన్, మైక్రోమ్యాక్స్, ఎల్జీ, హెచ్‌టీసీ, ఐఫోన్ కంపెనీల సెల్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నామని చెప్పారు. జోడి ఆఫర్‌తో కొన్ని రకాల సెలెక్టెడ్ బ్రాండ్లపై బ్లూటూత్, ఫ్లిప్ కవర్స, మెమరీ కార్డులు, హెడ్ఫోన్లు, ట్యాబ్, సౌండ్ సిస్టమ్స్, మిక్సీ, ఇండక్షన్ స్టవ్, రైస్కుక్కర్లతోపాటు మరెన్నో ఆకర్షణీయమైన వస్తువులు అందజేయనున్నట్లు తెలిపారు. ఒక మొబైల్ కొనుగోలు చేస్తే మూడు మొబైల్స్ ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. గెలక్సీ నోట్-4 కొనుగోలుపై ఎల్ఈడీ టీవీ ఉచితంగా, ఐఫోన్ 6(ఎస్), ఐఫోన్ 6(ఎస్) ప్లస్ కొనుగోలుపై మలేషియా ట్రిప్‌ని గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. తమ ఆఫర్లకు విశేష స్పందన లభిస్తోందన్నారు. డైమండ్ పార్కు, డాబాగార్డెన్‌స, గాజువాక, ఎన్ఏడీ, అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, తణుకు, అమలాపురం, విజయవాడ, గుంటూరులో మొత్తం 60 శాఖలున్నాయని చెప్పారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.