
సెల్‌పాయింట్‌లో ఆఫర్ల వెల్లువ
విశాఖపట్నం సిటీ : సెల్‌పాయింట్ 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 20 రోజులుగా వినియోగదారులకు ఇస్తున్న ప్రత్యేక ఆఫర్లు దీపావళితో ముగియనున్నాయి. ఆధునిక మోడళ్లతో సెల్‌పాయింట్ షోరూమ్‌లు కళకళలాడుతున్నాయి. భారీ డిస్కౌంట్లతో పాటు కాంబో, జోడీ ఆఫర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా సెల్‌పాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ మోహన్‌ప్రసాద్ పాండే మాట్లాడుతూ మొబైల్ కొనుగోలుదారులకు బంపర్ బహుమతుల కింద 10 మందికి మలేషియా ఫారిన్ ట్రిప్, ఐదుగురికి స్కూటీ పెప్స్‌లను డ్రా ద్వారా అందజేయనున్నట్టు తెలిపారు. తమ షోరూమ్స్‌లో శామ్‌సంగ్, సోనీ, నోకియా, కార్బన్, సెల్‌కాన్, మైక్రోమ్యాక్స్, ఎల్‌జీ, హెచ్‌టీసీ, ఐఫోన్ కంపెనీల సెల్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నామని చెప్పారు.
జోడి ఆఫర్‌తో కొన్ని రకాల సెలెక్టెడ్ బ్రాండ్లపై బ్లూటూత్, ఫ్లిప్ కవర్‌స, మెమరీ కార్డులు, హెడ్‌ఫోన్లు, ట్యాబ్, సౌండ్ సిస్టమ్స్, మిక్సీ, ఇండక్షన్ స్టవ్, రైస్‌కుక్కర్‌లతోపాటు మరెన్నో ఆకర్షణీయమైన వస్తువులు అందజేయనున్నట్లు తెలిపారు. ఒక మొబైల్ కొనుగోలు చేస్తే మూడు మొబైల్స్ ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. గెలక్సీ నోట్-4 కొనుగోలుపై ఎల్‌ఈడీ టీవీ ఉచితంగా, ఐఫోన్ 6(ఎస్), ఐఫోన్ 6(ఎస్) ప్లస్ కొనుగోలుపై మలేషియా ట్రిప్‌ని గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. తమ ఆఫర్లకు విశేష స్పందన లభిస్తోందన్నారు. డైమండ్ పార్కు, డాబాగార్డెన్‌స, గాజువాక, ఎన్‌ఏడీ, అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, తణుకు, అమలాపురం, విజయవాడ, గుంటూరులో మొత్తం 60 శాఖలున్నాయని చెప్పారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.