
కాలిపోయిన సెల్‌ఫోన్లు, ఇతర సామగ్రి
బద్వేలు అర్బన్ : స్థానిక సిద్దవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్‌లో ఉన్న ఖలందర్ సెల్ పాయింట్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. రోజూ మాదిరే శనివారం రాత్రి దుకాణం మూసివేసి వెళ్లగా.. ఆదివారం ఉదయం దుకాణంలో నుంచి దట్టమైన పొగలు వస్తుండడంతో స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని వారు సెల్‌పాయింట్ యజమాని షాజహాన్‌కు, అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని షెట్టర్ తెరచి చూడగా దుకాణంలోని ఏసీ నుంచి మంటలు వస్తుండటాన్ని గుర్తించి సీవోటు యంత్రం ద్వారా అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దుకాణంలోని సెల్‌ఫోన్లు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపకాధికారి ఓబులేసు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment