వరుణ్ ఆరడుగుల అందగాడు కాదు: చిరంజీవి | Naga Babu's Son Varun Tej debut movie launched, Mega family attended | Sakshi
Sakshi News home page

వరుణ్ ఆరడుగుల అందగాడు కాదు: చిరంజీవి

Published Thu, Feb 27 2014 1:31 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

వరుణ్ ఆరడుగుల అందగాడు కాదు: చిరంజీవి - Sakshi

వరుణ్ ఆరడుగుల అందగాడు కాదు: చిరంజీవి

హైదరాబాద్ : మెగా టైటిల్ అందిపుచ్చుకుని వెండితెరకు పరిచయం అవుతున్న వరుణ్తేజను ప్రముఖ నటుడు, కేంద్రమంత్రి చిరంజీవి ప్రశంసలతో ముంచెత్తారు. వరుణ్తేజ ఆరడుగుల అందగాడు కాదని....ఆరున్నర అడుగుల అందగాడు అని కితాబిచ్చారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్ర ముహూర్త కార్యక్రమం రామానాయుడు స్టూడియోస్లో  గురువారం లాంఛనంగా ప్రారంభమైంది.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ అభిమానులు ఇప్పటివరకూ తమను ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు.  తమ కుటుంబం నుంచి వచ్చిన అందరి హీరోలను ఆదరించినట్లుగానే... మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న వరుణ్కు సైతం అభిమానులు అండగా నిలవాలని కోరారు. ఈ సినిమా చక్కటి విజయం సాధించాలని అన్నారు.  నాగబాబు ఎంతో అదృష్టవంతుడని అన్నారు. రాంచరణ్ షూటింగ్లో ఉన్నందున ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడని చిరంజీవి తెలిపారు.

కాగా ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరైనా మాట్లాడకపోవటం చర్చనీయాంశమైంది. కార్యక్రమం అవగానే వెంటనే వెళ్లిపోయాడు. చిరంజీవి మొదలు నిన్నటి సాయి ధరమ్ తేజ్ వరకు మొత్తం ఆరుగురు హీరోలు మెగా కుటుంబం నుంచి వచ్చారు. కాగా మెగా ఫ్యామిలీ నుంచి ఏడో నెంబరుగా వస్తున్న వరుణ్ తేజ్ మెగా వారసత్వాన్ని నిలుపుతాడా..? లేదా..? అనేది సినిమా విడుదలయ్యాకే తేలనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement