Chirunjeevi
-
వరుణ్ ఆరడుగుల అందగాడు కాదు: చిరంజీవి
హైదరాబాద్ : మెగా టైటిల్ అందిపుచ్చుకుని వెండితెరకు పరిచయం అవుతున్న వరుణ్తేజను ప్రముఖ నటుడు, కేంద్రమంత్రి చిరంజీవి ప్రశంసలతో ముంచెత్తారు. వరుణ్‌తేజ ఆరడుగుల అందగాడు కాదని....ఆరున్నర అడుగుల అందగాడు అని కితాబిచ్చారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్ర ముహూర్త కార్యక్రమం రామానాయుడు స్టూడియోస్‌లో గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ అభిమానులు ఇప్పటివరకూ తమను ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. తమ కుటుంబం నుంచి వచ్చిన అందరి హీరోలను ఆదరించినట్లుగానే... మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న వరుణ్‌కు సైతం అభిమానులు అండగా నిలవాలని కోరారు. ఈ సినిమా చక్కటి విజయం సాధించాలని అన్నారు. నాగబాబు ఎంతో అదృష్టవంతుడని అన్నారు. రాంచరణ్ షూటింగ్లో ఉన్నందున ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడని చిరంజీవి తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరైనా మాట్లాడకపోవటం చర్చనీయాంశమైంది. కార్యక్రమం అవగానే వెంటనే వెళ్లిపోయాడు. చిరంజీవి మొదలు నిన్నటి సాయి ధరమ్ తేజ్ వరకు మొత్తం ఆరుగురు హీరోలు మెగా కుటుంబం నుంచి వచ్చారు. కాగా మెగా ఫ్యామిలీ నుంచి ఏడో నెంబరుగా వస్తున్న వరుణ్ తేజ్ మెగా వారసత్వాన్ని నిలుపుతాడా..? లేదా..? అనేది సినిమా విడుదలయ్యాకే తేలనుంది. -
టీ బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తా: చిరంజీవి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన అనివార్యమైతే పార్లమెంట్లో విభజన బిల్లుపై చర్చ సందర్భంగా సవరణలు ప్రతిపాదిస్తానని కేంద్ర పర్యాటక శాఖ సహాయ(స్వతంత్ర) మంత్రి చిరంజీవి చెప్పారు. బుధవారమిక్కడ ప్రవాస భారతీయ దివస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన పలు టీవీ చానళ్ల ప్రతినిధులతో మాట్లాడారు. ‘తెలంగాణ బిల్లు ప్రస్తుత రూపాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. నా లక్ష్యం సమైక్యాంధ్రే. విభజన తప్పనిసరైతే.. బిల్లు పార్లమెంటులో చర్చకొస్తే.. కొన్ని సవరణలు ప్రతిపాదిస్తా. ప్రధానంగా రెండు సవరణలు కోరుతాను. ఒకటి.. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి. రెండోది.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలి’ అని వివరించారు. బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగితేనే మంచిదన్నారు. ప్రజారాజ్యం పార్టీని పునరుద్ధరించే ఆలోచనేదీ తనకు లేదని.. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న అప్పటి పీఆర్పీ ఎమ్మెల్యేలెవరూ బయటకు వెళ్లరని చిరంజీవి చెప్పారు. తమ రాజకీయ భవితపై వారు ఆందోళనతో ఉన్నారని అంగీకరించారు. -
ఆ నాలుగు కుటుంబాలే పరిశ్రమను శాసిస్తున్నాయి
వారి వల్లే నటులకు అవకాశాలు రావడంలేదని హెచ్ఆర్సీకి ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమను దగ్గుబాటి, అల్లు అరవింద్, చిరంజీవి, ఎన్టీఆర్ కుటుంబాలే శాసిస్తున్నాయని, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లను వారి అధీనంలో పెట్టుకొని చిన్న నిర్మాతలకు థియేటర్లను ఇవ్వకుండా పొట్టగొడుతున్నారని ఆరోపిస్తూ న్యాయవాది అరుణ్‌కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)ను ఆశ్రయించారు. ఈ మేరకు సోవువారం కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. సినిమా పరిశ్రమలో ఈ కుటుంబాలే గుత్తాధిపత్యం చేస్తున్నాయని, దీంతో కొందరు నటులకు అవకాశాలు లేకుం డా పోతున్నాయని తెలిపారు. సినిమా అవకాశాలు లేకే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. చిత్ర పరిశ్రమలో వీరి ఆధిపత్యంపై విచారణ జరిపించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. అయితే ఆ 4 కుటుంబాల ఆధిపత్యం కారణంగా తమకు అన్యా యం జరిగిందంటూ ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులెవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామంటూ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు పేరిరెడ్డి నిరాకరించారు. -
పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టాలి: రాంగోపాల్ వర్మ
కాటం రాయుడా కదిరి నరసింహుడా అంటూ సోషల్ మీడియాలో కిర్రాక్ పుట్టిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ క్రేజి వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సొంతంగా ఓ రాజకీయ పార్టీ ప్రారంభించవచ్చని రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశాడు. అంతేకాక మాటల జోరు పెంచి ఇప్పటి వరకు రాజకీయ నేతలుగా మారిన నటులు ఎంజీఆర్ నుంచి చిరంజీవిలలో పవన్ కళ్యాణ్ డైనమిక్ లీడర్ అని ప్రశంసలతో ముంచెత్తారు. 'ఇప్పటి వరకు తాను నా జీవితంలో ఎప్పుడు ఓటు వెయ్యలేదని.. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని ప్రారంభిస్తే ఓటు వేస్తాను అనే మాటకు కట్టుబడి ఉంటాను. పవన్ కళ్యాణ్ కు తన ఓటు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పవర్ స్టార్ కు ఓటు వేసేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ లో ఆలోచనల్లో నిజాయితీ, కళ్లలో పట్టుదల. చరిష్మా, ఇంటెన్సిటిలను బాల్ థాకరేలో కూడా చూడలేదు. ప్రజారాజ్యం పార్టీకి పవన్ కళ్యాణ్ సారథ్యం వహించి ఉంటే అఖండ మెజారిటీని సాధించి ఉండేదని తన ప్రగాఢ విశ్వాసం' అని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు చేశారు. ఇంకా తాను పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి చేసిన వ్యాఖ్యలు కాదని.. తాను పవన్ ను కలిసి ఐదు సంవత్సరాలైందన్నాడు. ఓ డైరెక్టర్ గా కాకుండా ఓ ఆంధ్ర ప్రదేశ్ పౌరుడిగా స్పందించానని వర్మ తెలిపాడు. అంతేకాక చిరంజీవికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కాదని.. పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా చేసినవేనని వివరణ ఇచ్చాడు. ఈ రేంజ్ లో పవన్ కళ్యాణ్ ఎత్తుకోవడం వెనుక కారణాలేమై ఉంటాయని పవర్ స్టార్ అభిమానులు, సినీ అభిమానులు ఆలోచనల్లో పడ్డారు. ఏమైనా రాంగోపాల్ తన వ్యాఖ్యలతో మీడియాలో కాక పుట్టించడం ఖాయం.