'చిరు, పవన్ ల మధ్య అదే రిపీటైంది'
'చిరు, పవన్ ల మధ్య అదే రిపీటైంది'
Published Thu, Feb 27 2014 6:08 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
మెగా ఫ్యామిలీలో 'ప్రజారాజ్యం', ఇతర సంఘటనలు చిచ్చు రాజేశాయని తరచుగా వార్తల్లో వినిపిస్తునే ఉన్నాయి. ఆ వార్తలకు తోడుగా ప్రత్యక్షంగా కొన్ని సంఘటనలు చూస్తూన్న, పరోక్షంగా వింటున్న అభిమానులకు ఆ వార్తలు నమ్మశక్యం కలిగించలేదు. ఈ మధ్యకాలంలో ఏ ఫంక్షన్ కైనా చిరంజీవి హాజరైతే పవన్ రాకపోవడం కనిపించింది. కుటుంబ కార్యక్రమాన్ని తలపించిన రచ్చ ఆడియో ఇతర కార్యక్రమంలో పవన్ అడ్రస్ లేకుండా పోయింది. దీనిపై పవన్ అభిమానులు నానా హంగామా చేశారు. కాని మెగా ఫ్యామిలీ నుంచి మరో తెలుగు తెరకు పరిచమయ్యే వేదిక సాక్షిగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మధ్య విబేధాలు తారాస్థాయిలోనే ఉన్నాయనే వార్తలకు వేయి ఏనుగుల బలాన్ని ఇచ్చాయి.
ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టిన క్షణం నుంచి తనకు ఇష్టం లేని ఫంక్షన్ కు వచ్చానే అనే ఫీలింగ్ అణువణువునా కనిపించింది. తన సోదరుడి కుమారుడి ఆరంగేట్రంలో ఎలాంటి ఉత్సాహం లేకుండా మెట్లపై కూర్చుని అనాసక్తిని ప్రదర్శించడమే కాకుండా ఓ విధమైన నిరసనను వ్యక్తం చేసిన లెక్కలు బాగానే కనిపించాయి. ఈ కార్యక్రమంలో మెగాస్ఠార్ చిరంజీవి ముఖాన్ని పవర్ స్టార్ లు కనీసం చూడటానికి ప్రయత్నించలేదనే సత్యం స్పష్టం కనిపించింది. చిరంజీవి ఇచ్చిన అక్షింతల్ని ఏదో మోహమాటంగా తీసుకుని వరుణ్ తేజ్ ను అశ్వీరదించారు. ఆతర్వాత వెంటనే అక్కడి నుంచి తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్ నిష్క్రమించారు.
అయితే పవన్ తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మెగాస్ఠార్ తో విబేధాలు ఏస్థాయిలో ఉన్నా.. మరో సోదరుడి కార్యక్రమాన్ని రచ్చరచ్చ చేశాడనేది ఓ వర్గం వాదన. ఆర్ధికంగా ఓ రేంజ్ లో ఇబ్బందుల్లో కూరుకుపోయి.. తన కెరీర్ ను లాంచ్ చేశారు నాగబాబు. అలాంటి కార్యక్రమంలో పవన్ అలా ప్రవర్తించడం ఏమాత్రం బాగాలేదనే విమర్శలు భారీగానే వినిపించాయి. వాస్తవానికి చెప్పుకుంటే.. మెగాస్టార్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో లేకుంటే నాగబాబు, పవన్, మెగా ఫ్యామిలీ సభ్యులెవరికి స్థానం లేదనది కాదనలేదని వాస్తవం. ప్రజారాజ్యం పార్టీ తర్వాత మెగాస్టార్ వర్గం అంటూ పరిశ్రమలో కనుపించని చీలిక వచ్చింది. అయినా తమకు ఇష్టం ఉన్నా.. లేకున్నా మెగాస్టార్ ఎదురుపడితే ఇతరులు కనీసం ఆయన హోదాను గౌరవించడం మనం గమనిస్తునే ఉంటాం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునైనా పవన్ ఇష్టం లేకున్నా మెగాస్థార్ గౌరవించాలనేది కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా ఎన్నో ఆశలతో తన కుమారుడి కెరీర్ ఆరంభం కార్యక్రమం మీడియా, అభిమానులు, ప్రేక్షకుల సాక్షిగా నవ్వుల పాలైంది. మెగా ఫ్యామిలీలోని విభేదాలు పవన్ మూలంగా ఈ రోజు మళ్లీ బజారు కెక్కాయి.
తనకు ఇష్టం లేని పని చేస్తే .. 'మళ్లీ ఇదే రిపీట్ అవుద్ది' అంటూ బద్రి చిత్రంలో పవన్ కొట్టిన డైలాగ్ ప్రేక్షకులను రంజింప చేసింది. కాని పట్టు విడుపులన్నీ రెండుగంటలపాటు సాగే సినిమాల్లో అయితే పర్వాలేదు. కాని వాస్తవ జీవితానికి వస్తే.. గతంలో జరిగిన సంఘటనల్ని మనసులో పెట్టుకుని వరుణ్ తేజ్ సినిమా ఆరంభ కార్యక్రమంలో పవన్ తీరు ఏమాత్రం సమంజసంగా లేదని అంటున్నారు. చిరంజీవి ఎంత పెద్ద తప్పు చేసినా..పవన్ ఇలాంటి శిక్ష వేయడం సరికాదు అనేది మెజార్టీ సభ్యుల భావన.
Advertisement