తెలుగు సినీ పరిశ్రమలో మెగా-అల్లు ఫ్యామిలీలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఈ రెండు కుటుంబాలు ఒక్కచోట కనిపిస్తే ఫ్యాన్స్‌కు కన్నుల పండగే. అయితే ఇటీవల కాలంలో ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే మెగా ఇంట్లో ఎలాంటి సెలబ్రెషన్స్ అయిన అల్లు ఫ్యామిలీ మొత్తం అక్కడ వాలిపోతుంది. అయితే ఈ మధ్య వారు కలిసి ఎక్కడ కనిపించడం లేదు. చిరంజీవి బర్త్‌డే వేడుకలో బన్నీ కొడుకు తప్పా అల్లు ఫ్యామిలీకి సంబంధించిన వారు ఎవరూ కనిపించకపోవడంతో మరోసారి ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి.
చదవండి: సమంతతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా: చిన్మయి
ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ ఈ వార్తలపు ఖండించారు. మొదట్నుంచి ఉన్న బంధుత్వమే ఇప్పటికీ ఉందని, తమ కుటుంబాల మధ్య విబేధాలు వచ్చాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఎవరి స్టార్డమ్ వాళ్లకు వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు రావడం సహజమే అని ఆ వార్తలను ఆయన కొట్టిపారేశారు. అయితే తాజాగా బన్నీ తీరు చూసి కొందరు మరోసారి వీరి బంధుత్వం చెడిందా? అనే సందేహాలను లేవనేత్తున్నారు. దీనికి కారణం శుక్రవారం(సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డేకు అల్లు అర్జున్ విష్ చేయకపోవడమే.
చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ రిలీజ్‌కు ఇంకా 6 రోజులే.. అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన రాజమౌళి
చిరంజీవి బర్త్‌డేకు విష్ చేసిన అల్లు అర్జున్ మరి పవన్‌కు ఎందుకు విషెస్ చెప్పకపోవడం ఈ వార్తలకు మరోసారి ఆజ్యం పడింది. ఒక్క బన్నీ మాత్రమే కాదు అల్లు శీరిష్ కానీ, బన్నీ భార్య స్నేహా రెడ్డి సైతం పవన్ కల్యాణ్‌ని విష్ చేస్తూ ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. దీంతో మెగా ఫ్యామిలీ-అల్లు ఫ్యామిలీకి విభేదాలు ఉన్నా మాటే నిజమేనా? అంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. రెండు రోజుల క్రితమే ఈ వార్తలపై అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చిన బన్నీ విష్ చేయకపోవడంతో ఈ అంశం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. మరి ఇక దీనిపై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment