
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు గొప్ప మనసు చాటుకున్నారు. మండువేసవిలో సేవ కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలిచారు. ముంబయిలోని అంధేరి , భీవండి, జుహూలోని శంకర్ ఆలయం పరిసరాల్లో దాదాపు 1000 మంది చెర్రీ ఫ్యాన్స్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేసవిలో ఎండ వేడిమిని తట్టుకునేందుకు దాదాపు తొమ్మిది వేల మందికి మజ్జిగ పాకెట్స్ పంపిణీ చేశారు. తమ అభిమాన నటుడు చేసే సేవా కార్యక్రమాలను చూసి తాము స్ఫూర్తి పొందినట్లు తెలిపారు.
(ఇది చదవండి: ఈ వారం ఓటీటీ/ థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలివే)
రామ్‌చరణ్ అనగానే సిల్వర్‌స్క్రీన్ మీద ఆయనకున్న క్రేజే వేరు. సొసైటీకి ఆయన చేసే సేవలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. ఎన్నో అసోసియేషన్ల ద్వారా, ఎన్జీవోల ద్వారా, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానాలు, నేత్రదానాలు, కొవిడ్ సమయంలోనూ సహకారం అందించారు. తమ అభిమాన హీరో చేసిన మంచి పనులను ఆదర్శంగా తీసుకున్న ఫ్యాన్స్ సమాజానికి సాయపడాలని ముందుకొచ్చారు. తమ స్టార్‌లాగానే సమాజం పట్ల బాధ్యతతో ఉండాలని.. తమకు వచ్చిన ఆలోచనకు ఒక రూపం మాత్రమేనని అన్నారు. ఈ నెల 6న ముంబయిలోనూ.. ఏప్రిల్ 29న షోలాపూర్‌లోనూ ఈ మజ్జిక పంపిణీ, అన్నదానం కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.
(ఇది చదవండి: నరేశ్-పవిత్ర.. వారి బంధానికి ఇంతకన్నా ఏం కావాలి?)
Comments
Please login to add a commentAdd a comment