సాక్షి, హైదరాబాద్ : శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ‘చిరంజీవి ఇంటర్‌నేషనల్ స్కూల్స్’తో మెగా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని సీఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘చిరంజీవి ఇంటర్‌నేషనల్ స్కూల్ పేరిట స్థాపించిన సంస్థకు చిరంజీవి, రాంచరణ్, నాగబాబుకు గానీ ఎలాంటి సంబంధం లేదు. మెగాస్టార్ చిరంజీవి అభిమానులమైన తాము సేవా దృక్పధంతో, సామాజిక స్పృహతో ఈ స్కూల్ పేరిట సంస్థను స్థాపించాం. దిగువ తరగతి ప్రజలకు తక్కువ ఫీజుతో విద్యను అందించాలనే దృఢసంకల్పంతో ఈ సంస్థను ఏర్పాటు చేశాం.
మెగా కుటుంబం మీద ఉన్న అభిమనాంతో చిరంజీవి,రాంచరణ్, నాగబాబుని గౌరవ పౌండర్, గౌరవ అధ్యక్షులు, గౌరవ చైర్మన్‌గా మంచి ఉద్దేశంతో మేం నియమించుకునన్నాం. దయ ఉంచి మెగా స్నేహితులందరు ఈ చిరంజీవి ఇంటర్‌నేషనల్ స్కూల్ సంస్థకు చిరంజీవి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు. అదేవిధంగా మా చిరు (సంస్థ) ప్రయత్నాన్ని ముందుకు నడిపించి పేద ప్రజలకు విద్యను ఉచితంగా అందుబాటులోకి తేవడానికి మీరు కూడా సహకరిస్తారని కొండంత అభిమానంతో’ అని సీఈవో శ్రీనివాసరావు తెలిపారు.
Press Release : #Chiranjeevi international schools not owned by Megastar Chiranjeevi or his family.
— BARaju (@baraju_SuperHit) 13 May 2019
The school in Srikakulam is running by a Mega Fan. pic.twitter.com/iEOPBflyQ3
Comments
Please login to add a commentAdd a comment