పవన్ కోసం చిరంజీవి సైతం
నాడు గీత కోసం... నేడు ఆమెకు వ్యతిరేకంగా
పార్టీ పెట్టి పుష్కరం దాటినా అసెంబ్లీ గేటును తాకలేకపోయిన పవన్ కళ్యాణ్ను ఈసారైనా గేటు దాటించేందుకు ఆ ఫ్యామిలీ మొత్తం శ్రమిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలుమార్లు పిఠాపురంలో పర్యటించారు. వర్మ కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ.. మొత్తానికి తనను అసెంబ్లీకి పంపే బాధ్యత వర్మదే అని పూర్తిగా సరెండర్ అయ్యారు పవన్. ఇక నాగబాబు.. ఇంకా జబర్దస్త్ టీమ్ ఆది, గెటప్ శ్రీను ఇలా చాలామంది అక్కడ ప్రచారం చేస్తూనే ఉన్నారు. దీంతోబాటు మొన్న వరుణ్ తేజ్ సైతం రాడ్ షో నిర్వహించి బాబాయ్‌ను గెలిపించాలని కోరారు.
ఇది కూడా సరిపోవడం లేదని భావించిన పవన్ ఇక ఏకంగా తన పెద్దన్న చిరంజీవిని సైతం రంగంలోకి దించుతున్నారు. తానూ రాజకీయాలకు దూరమని, అసలు పక్క రాష్ట్ర పాలిటిక్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని, తానిప్పుడు పూర్తిగా సినిమాల మీద దృష్టిపెట్టానని, తనను పాలిటిక్స్‌లో ఇన్వాల్వ్ చేయవద్దని ఆమధ్య మీడియాముఖంగా ప్రజలకు వివరణ ఇచ్చారు. ఐతే ఇప్పుడు పవన్ పరిస్థితి దారుణంగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నా తరుణంలో చిరంజీవి ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబులతో కూర్చుని ఒక వీడియోను సైతం రిలీజ్ చేసారు.
ఇక అవనీ కాదు కానీ నేనే వస్తాను అని ఫిక్స్ అయిన చిరంజీవి ఇప్పుడు పిఠాపురం వస్తున్నారు. త్వరలో అయన ప్రచారం చేస్తారు. వాస్తవానికి ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పవన్ మీద పోటీ చేస్తున్న వంగా గీత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచారు. అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా వర్మ పోటీ చేశారు. ఆనాడు చిరంజీవి వంగా గీతకు పిఠాపురంలో ప్రచారం చేశారు. అప్పుడు గీత ఏకంగా వర్మను ఓడించి అసెంబ్లీకి వెళ్లారు.
అయితే ఆ వంగా గీత ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మళ్ళీ అదే పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఐతే ఇప్పుడు అదే చిరంజీవి గీతకు వ్యతిరేకంగా తమ్ముడు పవన్ కోసం ప్రచారం చేస్తున్నారు. గతంలో గీతను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేసిన చిరంజీవి ఇప్పుడు అదే గీతను ఓడించాలంటూ తమ్ముడి కోసం ప్రచారం చేయబోతున్నారు. మొత్తానికి సీఎం వైఎస్ జగన్ ప్రభావంతో పవన్‌కు ఓటమి భయం పట్టుకుంది. దానికితోడు స్థానికురాలు అయిన గీతను ఓడించడం తనకు అసాధ్యం అని పవన్ కు అర్థం కావడంతో కనీసం జీవితంలో ఒకసారి అయినా ఎమ్మెల్యే అవ్వాలన్న జీవితాశయం నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
:::: సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment