మెగా కోడలు లావణ్య త్రిపాఠి గుడ్‌న్యూస్ చెప్పింది. తన కుటుంబంలో జరిగిన ఆనందాన్ని అందరికీ చెప్పింది. అలానే ఓ ఫొటోని పోస్ట్ చేసి తన సంతోషాన్ని బయటపెట్టింది. ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది. ఇంతకీ హీరోయిన్ లావణ్య ఏం చెప్పింది? ఏం ఫొటో పోస్ట్ చేసిందనేది ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)
'అందాల రాక్షసి' మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. మీడియం రేంజ్ హీరోలతో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. కాకపోతే సాధారణ హీరోయిన్‌గానే ఉండిపోయింది. మరోవైపు 'మిస్టర్' సినిమా చేస్తున్న టైంలో మెగాహీరో వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడింది కానీ ఈ విషయాన్ని చాలా రహస్యంగా మెంటైన్ చేస్తూ వచ్చింది. 2023 జూన్‌లో నిశ్చితార్థం, నవంబరులో ఈమె పెళ్లి జరిగింది.
మెగా కోడలు అయిన తర్వాత లావణ్య ఏం పోస్ట్ చేసినా సరే అభిమానులు చూస్తూ వస్తున్నారు. అలా తాజాగా తనకు మేనల్లుడు పుట్టిన విషయాన్ని ఇన్ స్టాలో పంచుకుంది. అలానే సొట్టబుగ్గల జీన్స్ తన కుటుంబంలో ఈ పిల్లాడు కొనసాగిస్తున్నాడనే శుభవార్తని చెప్పి తెగ సంతోషపడిపోయింది. ఆ పిల్లాడి ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేసినప్పటికీ.. ముఖం కనిపించకుండా ఏమోజీ పెట్టింది. సో అదన్నమాట విషయం.
(ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల గొడవ.. వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు!)
Comments
Please login to add a commentAdd a comment