
మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికి తెలిసిందే. ప్రతి ఏడాది సంక్రాంతికి.. చిరు కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి పండగ జరుపుకుంటారు. అలాగే వీలు దొరికినప్పుడల్లా.. ఆదివారం రోజున మెగా ఫ్యామిలీ చిన్నపాటి గెట్ టూ గెదర్ లాంటిది నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో చాలా మంది వారివారి ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి తన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. తన ప్రియమైనవారిని మిస్ అవుతున్నానంటూ పేర్కొన్న చిరు.. లాక్‌డౌన్‌కు ముందు ఓ ఆదివారం తన తల్లి చెల్లలు, తమ్ముళ్లు అంతా కలిసి భోజనం చేస్తున్న ఫొటోను కూడా షేర్ చేశారు.
ఈ చిత్రంలో చిరంజీవితోపాటు ఆయన తల్లి అంజనాదేవి, తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్, చెల్లెలు మాధవి, విజయలు ఉన్నారు. ‘లాక్‌డౌన్‌కు ముందు ఓ ఆదివారం రోజున తీసిన ఫొటలో ఇది. నా ప్రియమైనవారిని మిస్ అవుతున్నాను. మీలో చాలా మంది కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారని నాకు తెలుసు. త్వరలోనే మళ్లీ ఇలాంటి సమయం మనకు తిరిగి రావాలని ఆశిస్తున్నాను’ అని చిరంజీవి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment