పెళ్లి పనులు మొదలుపెట్టిన మెగాకపుల్ | Varun Tej Lavanya Tripathi Wedding Preparations Video | Sakshi
Sakshi News home page

Varun Tej Lavanya Tripathi: పెళ్లి డేట్ ఫిక్స్.. అదే నెలలో శుభకార్యం?

Published Sat, Sep 16 2023 9:04 PM | Last Updated on Sat, Sep 16 2023 9:18 PM

 Varun Tej Lavanya Tripathi Wedding Preparations Video - Sakshi

మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగేందుకు అంతా రెడీ అయినట్లు కనిపిస్తుంది. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్.. కాబోయే భార్యతో కలిసి ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!)

'ముకంద' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్.. ఆ తర్వాత పలు విభిన్నమైన సినిమాల చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య గాండీవధారి అర్జున' చిత్రంతో వచ్చాడు గానీ హిట్ కొట్టలేకపోయాడు. ఇకపోతే 'మిస్టర్' మూవీ చేస్తున్నప్పుడు హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో పడ్డాడు. కానీ ఆ విషయాన్ని దాదాపు ఆరేడేళ్ల పాటు చాలా సీక్రెట్‌గా ఉంటారు. 

ఈ ఏడాది జూన్‌ 9న వరుణ్-లావణ్య.. పెద్దల సమక్షంలో గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. దీంతో ఈ ప్రేమ కాస్త బయటపడింది. అయితే ఈ జంట.. ఆగస్టు చివరి వారంలో పెళ్లి చేసుకుంటారనే టాక్ వచ్చింది. కానీ కారణాలేంటో తెలీదు గానీ అది జరగలేదు. ఇప్పుడు సడన్‌గా ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా స్టోర్‌లో కనిపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలోకి కనిపించింది. దీంతో పెళ్లి పనులు మొదలైనట్లే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. నవంబరులో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఉండనుందని సమాచారం.

(ఇదీ చదవండి: రెచ్చిపోతున్న తెలుగమ్మాయి.. 'జవాన్' బ్యూటీ గ్లామర్ ట్రీట్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement