కెమెరా ముందుకు నాగబాబు తనయ | Niharika Konidela turns TV Anchor | Sakshi
Sakshi News home page

కెమెరా ముందుకు నాగబాబు తనయ

Published Wed, Mar 19 2014 11:38 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

కెమెరా ముందుకు నాగబాబు తనయ - Sakshi

కెమెరా ముందుకు నాగబాబు తనయ

హైదరాబాద్: మోగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు వారసులు మాత్రమే తెర ముందుకు వచ్చారు. కొణిదెల వంశం నుంచి తొలిసారిగా వారసురాలు తెర ముందుకు రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు తనయ నిహారిక కొణిదెల కెమెరా ముందుకు వచ్చారు. బుల్లితెరపై వ్యాఖ్యాత ఆమె కనిపించనున్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే చిన్న పిల్లల డాన్స్ కార్యక్రమానికి ఆమె యాంకర్గా వ్యవహరించనున్నారు.

నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ హీరోగా తెలుగుతెరగా పరిచయం కానున్నాడు. ఇక నాగబాబు కూడా పలు టీవీ కార్యక్రమాలకు నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆయన తనయ కూడా తండ్రి బాటలోనే ముందుకు సాగుతోంది. వ్యాఖ్యాతగా నిహారిక ఏమేరకు రాణిస్తోందనని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement