నిహారిక ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్ | Date Locked For Niharika Konidela Engagement | Sakshi
Sakshi News home page

మెగా డాట‌ర్ ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్

Jul 29 2020 1:46 PM | Updated on Jul 29 2020 2:04 PM

Date Locked For Niharika Konidela  Engagement - Sakshi

కొణిదెల వారింట పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల ఎంగేజ్‌మెంట్ తేదీ అధికారికంగా వెల్ల‌డైంది. గుంటూరు ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్‌రావు కుమారుడు చైత‌న్య‌తో నిహారిక‌కు ఆగ‌స్టు 13న నిశ్చితార్థం జ‌ర‌గ‌నుంది. కేవ‌లం కుటుంబ‌స‌భ్యుల సార‌ధ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్ప‌టికే ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక వివాహం కూడా  ఈ ఏడాది చివ‌ర్లో నిర్వ‌హిస్తామ‌ని ఇదివ‌ర‌కే నాగ‌బాబు స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. (హ్యాపీ బర్త్‌డే.. లవ్‌ : నిహారిక)

చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం కుటుంబాల‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక ఒక మ‌న‌సు చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన మెగా డాట‌ర్ నిహారిక హ్యాపీ వెడ్డింగ్, సూర్య‌కాంతం వంటి చిత్రాల్లోనూ న‌టించారు. అశోక్ సెల్వ‌న్ హీరోగా న‌టించ‌నున్న త‌మిళ చిత్రంలోనూ న‌టించ‌నున్నారు. ఇక చైతన్య విషయానికి వస్తే... హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో బిజినెస్‌ స్ట్రాటజిస్ట్‌గా వర్క్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన చైతన్య బిట్స్‌ పిలానీలో మాస్టర్స్‌ ఇన్‌ మ్యాథమ్యాటిక్స్‌ డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎమ్‌బీఏ పూర్తి చేశారు. (ప్రేమ ఏంటి? పెళ్లేంటి?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement