Megastar Chiranjeevi Celebrates His 67th Birthday With Family Away From The City Photos Viral - Sakshi
Sakshi News home page

Chiranjeevi Birthday Celebrations 2022: నగరానికి దూరంగా చిరు బర్త్‌డే వేడుకలు, ఫొటోలు వైరల్‌

Published Tue, Aug 23 2022 6:26 PM | Last Updated on Tue, Aug 23 2022 7:08 PM

Chiranjeevi Celebrates His 67th Birthday With Family Away From The City - Sakshi

మెగాస్టార్ చిరంజీవి 67వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం(ఆగస్ట్‌ 22) ఆయన బర్త్‌డే సందర్భంగా సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ చేసిన సందడి అంతఇంత కాదు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ మొత్తం చిరు బర్త్‌డే పోస్ట్స్‌తో నిండిపోయాయి. ఈ స్పెషల్‌ డేను చిరు తన కుటుంబ సభ్యులతో హ్యాపిగా గడిపారు. ఈ విషయాన్ని స్వయంగా చిరు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా తనకు విషెస్‌ తెలిపన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

చదవండి: అప్పట్లోనే బిగ్‌బి కంటే అధిక పారితోషికం అందుకున్న చిరు, వైరల్‌గా కవర్‌ ఫొటో

ఈ మేరకు చిరు ట్వీట్‌ చేస్తూ.. ‘ఈ పుట్టిన రోజును(ప్రత్యేకమైన రోజు) నా కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి దూరంగా జరుపుకున్నాను. కుటుంబంతో కలిసి గడిపిన ఆ క్షణాలు అద్భుతం’ అంటూ రాసుకొచ్చారు. అలాగే కటుంబంతో కలిసి సందడి చేసిన ఫొటోలను కూడా చిరు పంచుకున్నారు. ఇందులో ఆయన భార్య సురేఖ, మెగా, అల్లు కుటుంబానికి చెందిన పలువురు హీరోలు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే బన్నీ, ఆయన భార్య స్నేహా రెడ్డి, అల్లు అరవింద్‌ మాత్రం ఈ వేడుకలో మిస్‌ అయ్యారు. రీసెంట్‌గా బన్నీ భార్యతో కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement