
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు : సూపర్ స్టార్
తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, ప్రస్తుతం సినిమాల్లో సంతోషంగా ఉన్నానని నటుడు శివరాజ్‌కుమార్
సాక్షి, బెంగళూరు : తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, ప్రస్తుతం సినిమాల్లో సంతోషంగా ఉన్నానని నటుడు శివరాజ్‌కుమార్ అన్నారు. శుక్రవారం హాసన్ నగరంలో కళ్యాణ్ జువెలరీ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చిన శివరాజ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ... తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వస్తున్న వార్తలు అన్నీ వదంతులేనని అందులో నిజం లేదని అన్నారు.
అలాంటిది ఏమైనా ఉంటే మొదట మీడియాకే చెబుతానని అన్నారు. తాను ప్రస్తుతం కళ్యాణ్ జువెలరి ప్రచారకర్తగా ఉన్నానని చెప్పారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన తల్లి మృతి చెందిన సందర్భంగా తమను పరామర్శించడానికి వచ్చారని, ఇందులో ఎటువంటి రాజకీయం లేదన్నారు.