శివన్న అని ప్రేమగా పునీత్‌ నన్ను పిలుస్తున్నట్టు వినిపిస్తోంది: శివ రాజ్‌కుమార్‌ | Shiva Rajkumar Remembers His Late Brother Puneeth Rajkumar | Sakshi
Sakshi News home page

Puneetha Rajkumar: ‘శివన్న అని ప్రేమగా పునీత్‌ నన్ను పిలుస్తున్నట్టు వినిపిస్తుంది’

Published Mon, Nov 29 2021 8:08 AM | Last Updated on Mon, Nov 29 2021 8:18 AM

Shiva Rajkumar Remembers His Late Brother Puneeth Rajkumar - Sakshi

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణించిన నేటికి నెల రోజులు. ఆయన మన మధ్య లేరనే చేదు నిజాన్ని నిజాన్ని ఫ్యాన్స్‌, సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికీ పునీత్‌ సమాధికి ఆయన అమిమానులు, సన్నిహితులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న పునీత్‌ అన్న, హీరో శివరాజ్‌ కుమార్‌ తమ్ముడి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతరం అయ్యారు. 

చదవండి: పునీత్‌ చనిపోయాకే ఆ విషయం తెలిసింది, షాకయ్యా: రాజమౌళి

తన చిన్న తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకుంటా భావోద్వేగానికి లోనయ్యారు. తాను జీవించి ఉన్నంతవరకూ పునీత్‌ కుటుంబానికి సాయం చేస్తూనే ఉంటానని భరోసా ఇచ్చాడు. అలాగే ఆయన మాట్లాడుతూ.. ‘పునీత్‌.. మరణాన్ని ఇప్పటికీ నేనింకా నమ్మలేకపోతున్నాను. అప్పూ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తోంది. శివన్న అని ప్రేమగా పిలుస్తున్న గొంతు వినిపిస్తోంది. నెల రోజులు ఎలా గడిచాయో కూడా అర్థం కావడం లేదు. ఈ బాధ నుంచి బయట పడేందుకు సినిమాలపై దృష్టి పెడుతున్నా. 

చదవండి: పునీత్‌ సంస్మరణ సభలో స్టార్‌ హీరోకు చేదు అనుభవం

అయినప్పటికీ ఎక్కడికి వెళ్లినా పూల దండలతో ఉన్న పునీత్‌ ఫొటోలే కనిపిస్తున్నాయి. వాటిని చూసిన ప్రతిసారీ ఒక్కసారి కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. అందుకే వాటిని చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. ఈ భూమ్మీద ప్రతి ఒక్కరికి మరణం అనివార్యమని తెలుసు. ఎప్పుడో ఒకసారి నా ఫొటోలు కూడా అలాగే పెడతారని కూడా తెలుసు. కానీ నాకంటే ముందు నా చిన్న తమ్ముడి ఫొటోలను అలా చూడలేకపోతున్నా. సమయంలో అన్నింటిని మర్చిపోయేలా చేస్తుందంటారు. కానీ అది చాలా అబద్ధం’ అంటూ ఆయన ఏమోషనల్‌ అయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement