ధనుష్‌కి వీరాభిమాని: కన్నడ స్టార్‌ హీరో | Shivarajkumar to Play Dhanush Brother in Captain Miller Movie | Sakshi
Sakshi News home page

Dhanush-Shiva Rajkumar: ధనుష్‌కు అన్నగా శివరాజ్‌ కుమార్‌

Published Wed, Dec 7 2022 8:48 AM | Last Updated on Wed, Dec 7 2022 8:50 AM

Shivarajkumar to Play Dhanush Brother in Captain Miller Movie - Sakshi

చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు ధనుష్‌. కోలీవుడ్, హాలీవుడ్‌ వయా బాలీవుడ్‌ అంటూ పరుగులు పెడుతున్న ఈయన ఇప్పటికే తెలుగు చిత్రపశ్రమంలోనూ అడుగు పెట్టారు. ఈ ఏడాది ఈయన నటించిన మారన్, ది గ్రే మెన్, తిరుచ్చిట్రం ఫలం, నానే వరువేన్‌ చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి. తాజాగా తెలుగు, తమిళం భాషల్లో నటిస్తున్న వాతి చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తెరపై రావడానికి ముస్తాబవుతోంది.

అదే విధంగా మరో తెలుగు చిత్రంలో కూడా నటిస్తున్నారు. తమిళంలో కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రం చేస్తున్నారు. రాఖీ, సానికాగితం చిత్రాల ఫేమ్‌ అరుణ్‌ మాదేశ్వరన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ ఇప్పటికే తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ జరుపుకుంటోంది. ఇందులో కన్నడ స్టార్‌ నటుడు శివరాజ్‌ కుమార్‌ ధనుష్‌కు అన్నయ్యగా నటించడం విశేషం. ప్రస్తుతం ఈయన ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ధనుష్‌తో కలిసి నటించడం గురించి శివరాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తాను ధనుష్‌కు వీరాభిమాని అన్నారు. ఆయన నటించిన అన్ని చిత్రాలు చూస్తానని చెప్పారు. అలాంటిది ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు. కాగా శివరాజ్‌ కుమార్, రజినీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న జైలర్‌ చిత్రంలోనూ ముఖ్య పాత్ర పోషి స్తున్నారు. ఇలా ఒకేసారి ధనుష్‌, ఆయన మామతోనూ శివరాజ్‌ కుమార్‌ కలిసి నటించడం విశేషం.   

చదవండి: 
హీరోయిన్‌ అయితే అలాంటి పాత్రలు చేయొద్దా?: ట్రోలర్స్‌కు మృణాల్‌ ఘాటు రిప్లై
తొలిసారి ​కాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించిన కీర్తి సురేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement