
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్
కన్నడ పవర్‌స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ 43వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. శనివారం బెంగళూరు సదాశివనగరలో ఆయన నివా సం వద్ద అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు చెప్పారు. శుక్రవారం రాత్రి నుంచే నివాసం వద్ద అభిమానుల సందడి ఆరంభమైంది. అభిమానులు అయనకు ప్రీతియ అప్పు, రాజరత్న, నటసార్వభౌమ తదితర బిరుదలతో అభినందనలు తెలిపారు. వారంరోజుల నుంచి అభిమానులు పునీత్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు.
దివ్యాంగులు, అభిమానులు తెచ్చిన కేక్‌లను పునీత్ వద్దనకుండా కట్ చేసి వారికి తినిపించారు. పలువురు నటులు, సినీ ప్రముఖులు పునీత్‌కు జన్మదిన శుభాకాంక్షులు తెలిపారు. అన్న శివరాజ్‌కుమార్ ఉదయం పునీత్ నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మంచి కథ ఉంటే ఇద్దరం తప్పకుండా కలిసి నటిస్తామన్నారు. సదాశివనగర పోలీసులు కూడా పునీత్ జన్మదిన వేడుకలో పాల్గొని కేక్‌ను తినిపించారు. పునీత్, తల్లి పార్వతమ్మ చిత్రపటాన్ని చూసి ఉద్వేగానికి గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment