Puneeth Rajkumar Last Tweet To Brother Shivarajkumar, Goes Viral - Sakshi
Sakshi News home page

Puneetha Rajkumar Last Tweet: అన్నయ్య శివరాజ్‌ కుమార్‌కు పునీత్‌ ఆఖరి ట్వీట్‌

Published Fri, Oct 29 2021 4:12 PM | Last Updated on Fri, Oct 29 2021 5:28 PM

Puneeth Rajkumar Last Tweet To Brother Shivarajkumar Goes Viral - Sakshi

Puneeth Rajkumar Last Tweet Goes Viral: కన్నడ స్టార్‌ హీరో పునీత్ రాజ్‌కుమార్(46)ఈరోజు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడించారు. నటుడిగా నేపథ్య గాయడకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యతగా, ఆడియో కంపెనీ ఓనర్‌గా, నిర్మాతగా ఎన్నో రంగాల్లో కన్నడ ఇండస్ట్రీకి సేవలందించారు పునీత్ రాజ్‌కుమార్‌. శాండల్‌ వుడ్‌ పవర్‌ స్టార్‌గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న పునీత్‌ మరణం వార్త తెలిసి అభిమానులంతా ఆసుపత్రికి భారీగా తరలి వస్తున్నారు. 

చదవండి: పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతి, షాక్‌లో భారత సినీ పరిశ్రమ

అంతేగాక పునీత్‌ మృతిని జీర్ణించుకోలేని ఆయన ఫ్యాన్స్‌ ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. దీంతో కర్ణాటకలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదిలా ఉంటే పునీత్‌ మరణాంతరం పలువురు ఆయన సోషల్‌ మీడియా పోస్టులు సెర్చ్‌ చేస్తున్నారు. దీంతో ఆయన చేసిన ఆఖరి ట్వీట్‌, మాటలు, ఇంటర్వ్యూలు వైరల్‌ అవుతున్నాయి. చివరగా ఆయన తన సోదరుడు, హీరో శివ రాజ్‌కుమార్‌కు ట్వీట్‌ చేశారు. ఆయన నటిస్తున్న భజరంగీ 2 మూవీ విజయం సాధించాలని అన్నయ్యకు, మూవీ టీంకు బెస్ట్ విషెస్ చెబుతూ పునీత్‌ లాస్ట్‌ ట్వీట్‌ చేశారు. 

చదవండి: తారక్‌ నా సోదరుడు: పునీత్‌ పాత వీడియో వైరల్‌

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్‌కుమార్ వెండితెర మీద తిరుగులేని స్టార్ డమ్‌ సాధించారు. కన్నడ నాట అత్యథిక కలెక్షన్లు సాధించిన హీరోగా, అత్యథిక పారితోషికం అందుకున్న హీరోగానూ రికార్డ్ సృష్టించారు. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో 29 సినిమాలు చేశారు పునీత్‌ రాజ్‌కుమార్‌. చివరగా యువరత్న సినిమాలో నటించారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేయటంతో పాటు తెలుగు ఆడియన్స్‌కు చేరవయ్యేందుకు టాలీవుడ్‌ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం హోంబలే బ్యానర్‌లో ద్విత్వ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాలనుకున్నారాయన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement