last tweet
-
పునీత్ రాజ్‌కుమార్ ఆఖరి ట్వీట్ వైరల్..
Puneeth Rajkumar Last Tweet Goes Viral: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్(46)ఈరోజు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడించారు. నటుడిగా నేపథ్య గాయడకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యతగా, ఆడియో కంపెనీ ఓనర్‌గా, నిర్మాతగా ఎన్నో రంగాల్లో కన్నడ ఇండస్ట్రీకి సేవలందించారు పునీత్ రాజ్‌కుమార్. శాండల్ వుడ్ పవర్ స్టార్‌గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న పునీత్ మరణం వార్త తెలిసి అభిమానులంతా ఆసుపత్రికి భారీగా తరలి వస్తున్నారు. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ మృతి, షాక్‌లో భారత సినీ పరిశ్రమ అంతేగాక పునీత్ మృతిని జీర్ణించుకోలేని ఆయన ఫ్యాన్స్ ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. దీంతో కర్ణాటకలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదిలా ఉంటే పునీత్ మరణాంతరం పలువురు ఆయన సోషల్ మీడియా పోస్టులు సెర్చ్ చేస్తున్నారు. దీంతో ఆయన చేసిన ఆఖరి ట్వీట్, మాటలు, ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి. చివరగా ఆయన తన సోదరుడు, హీరో శివ రాజ్‌కుమార్‌కు ట్వీట్ చేశారు. ఆయన నటిస్తున్న భజరంగీ 2 మూవీ విజయం సాధించాలని అన్నయ్యకు, మూవీ టీంకు బెస్ట్ విషెస్ చెబుతూ పునీత్ లాస్ట్ ట్వీట్ చేశారు. చదవండి: తారక్ నా సోదరుడు: పునీత్ పాత వీడియో వైరల్ ದಶಕಗಳ ಹಿಂದೆ ಕಥೆಯೊಂದು ಹುಟ್ಟಿತ್ತು. ನಮ್ಮ ಜನ, ನಮ್ಮ ನೆಲದ ಹಿರಿಮೆಯನ್ನು ಮೆರೆದಿತ್ತು. ನಮ್ಮ ಅಡವಿಯ ಹಸಿರನ್ನು ಜಗತ್ತಿಗೇ ಹರಡಿತ್ತು. ಪೀಳಿಗೆಗೆ ಸ್ಫೂರ್ತಿ ನೀಡಿ ಅಜರಾಮರವಾಗಿತ್ತು. ಆ ಚರಿತ್ರೆ ಮರುಕಳಿಸುವ ಸಮಯವೀಗ ಬಂದಿದೆ. @amoghavarsha @AJANEESHB @PRK_Productions @PRKAudio #mudskipper pic.twitter.com/ncE6CxOQrg — Puneeth Rajkumar (@PuneethRajkumar) October 27, 2021 కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్‌కుమార్ వెండితెర మీద తిరుగులేని స్టార్ డమ్ సాధించారు. కన్నడ నాట అత్యథిక కలెక్షన్లు సాధించిన హీరోగా, అత్యథిక పారితోషికం అందుకున్న హీరోగానూ రికార్డ్ సృష్టించారు. దాదాపు 20 ఏళ్ల కెరీర్లో 29 సినిమాలు చేశారు పునీత్ రాజ్‌కుమార్. చివరగా యువరత్న సినిమాలో నటించారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయటంతో పాటు తెలుగు ఆడియన్స్‌కు చేరవయ్యేందుకు టాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం హోంబలే బ్యానర్లో ద్విత్వ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాలనుకున్నారాయన. Best wishes for the entire team of #Bhajarangi2. @NimmaShivanna @NimmaAHarsha @JayannaFilms — Puneeth Rajkumar (@PuneethRajkumar) October 29, 2021 -
అదే రిషి కపూర్ చివరి కోరిక..
కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ నేడు ఉదయం మరణించిన విషయం తెలిసిందే. క్యాన్సర్‌ను జయించిన ఆయన మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ఆయన మరణంపై కుటుంబ సభ్యులు ఓ లేఖ విడుదల చేశారు. "లుకేమియాతో రెండు సంవత్సరాలపాటు పోరాడిన రిషి కపూర్ నేడు ఉదయం 8.45 గంటలకు కన్నుమూశారు. చివరి క్షణాల్లోనూ వైద్య సిబ్బందితో నవ్వుతూ నవ్విస్తూ గడిపారు. క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న సమయంలోనూ ఆయన అంతే సరదాగా ఉండేవారు. కుటుంబ సభ్యులతో గడపడం, ఫ్రెండ్స్‌తో ముచ్చటించడం, ఇష్టమైన ఫుడ్ తసుకోవడం.. ఇవన్నీ చూసి ఆయన్ని కలవడానికి వచ్చినవాళ్లందరూ ఆశ్చర్యపోయేవాళ్లు. ప్రపంచం నలుమూలల నుంచీ అభిమానులు కురిపించిన ప్రేమాభిమానాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మనమందరం ఆయన్ను కన్నీళ్లతో కాకుండా చిరునవ్వుతో గుర్తు చేసుకోవాలని ఆయన చివరి క్షణాల్లో కోరుకున్నారు. కాగా ప్రస్తుతం ప్రపంచం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. కాబట్టి ప్రభుత్వం విధించిన నిబంధనలను అందరూ తప్పక పాటించండ"ని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. (ప్రముఖ నటుడు రిషీకపూర్ కన్నుమూత) రిషి కపూర్ చివరి ట్వీట్.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రిషి కపూర్ ఏప్రిల్ 2న చివరిసారిగా ట్వీట్ చేశారు. ఆఖరి ట్వీట్‌లోనూ అతను ఇతరుల శ్రేయస్సును కోరుకుంటూ తన మంచిమనసును చాటుకున్నారు. కరోనా వైరస్‌తో నిర్విరామంగా పోరాడుతున్న వైద్యులు, నర్సులు, పోలీసుల పట్ల హింసను మానుకోవాలని ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేశారు. మనకోసం వారు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని అలాంటి వారిపై దాడులకు దిగడం మానుకోవాలని కోరారు. అయితే గతంలో కొన్నిసార్లు ఆయన చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినప్పటికీ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడిచేయడంలో ఆయనెప్పుడూ వెనకడుగు వేయకపోవడం గమనార్హం. (క్యాన్సర్‌ను జయించి..ముంబైలో కాలుమోపి..) -
శ్రీదేవి చేసిన ఆఖరి ట్వీట్ ఇదే..
సాక్షి, ముంబయి : ప్రముఖ సినీనటి శ్రీదేవి అకాల మరణం సినీలోకాన్నే కాకుండా యావత్భారతాన్ని తీవ్రశోకంలో ముంచెత్తింది. ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమెకు సంబంధించి ప్రతి అంశాన్ని నెట్టింట్లో వెతికి తెలుసుకుంటున్నారు. ఆసక్తికరమైన ప్రతి అంశాన్ని ఒడిసి పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె చనిపోవడానికి ముందు చివరిసారిగా చేసిన ట్వీట్ ఏమిటి అని శోధించగా శుక్రవారమే ఆమె ఆఖరి ట్వీట్ చేశారు. అది కూడా ఓ తమిళ సినిమాకు మంచి జరగాలని కోరుకుంటూ. ఈ నెల (ఫిబ్రవరి) 23న ఆమె కాతాడి అనే చిత్ర బృందానికి ఆల్ దిబెస్ట్ చెప్పారు. అందులో భాగంగా ఆ చిత్ర ట్రైలర్‌ను తన ట్విటర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి కల్యాణ్ దర్శకత్వం వహించగా అవిశేక్ కార్తిక్, సాయి ధనిష్క, డానియెల్ అన్నీ పోప్ ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. తన వ్యవహారాలను చూసుకుంటూనే తన చుట్టూ ఉండేవారి మంచిని శ్రీదేవీ ఎప్పుడూ కోరుకుంటారని చెప్పేందుకు ఈ ట్వీట్ ఉదాహరణ అంటూ నెటిజన్లు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు శ్రీదేవి కొనసాగించిన తన ట్విటర్ ఖాతాను ఒకసారి పరిశీలిస్తే.. శ్రీదేవి ట్విటర్లో చేరిన సంవత్సరం : మే, 2012 స్టేటస్ : నటి-అమ్మ-గృహిణి-నటిగా మరోసారి శ్రీదేవీ చేసిన ట్వీట్లు : 1,848 శ్రీదేవి ఎంతమందిని ఫాలో అయ్యారు : 64 శ్రీదేవిని ఫాలో అవుతున్నవారి సంఖ్య : 1.41 మిలియన్లు ఆమె వివిధ ట్వీట్లకు చేసిన లైక్‌లు : 3,860 (శ్రీదేవి చేసిన చివరి ట్వీట్ ఫిబ్రవరి, 23, 2018) Wishing the cast and crew of Kaathadi all the very best! @avishekactor @saidhansika https://t.co/MeKT4Uu33P — SRIDEVI BONEY KAPOOR (@SrideviBKapoor) 23 February 2018 -
ఆ ఉగ్రవాది లాస్ట్ ట్వీట్...
శ్రీనగర్: అంతర్జాలం ద్వారా జమ్ము కశ్మీర్ యువతను ఉగ్రవాదం పైపు ఆకర్షించడంలో విజయం సాధించిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్హాన్ ముజఫర్ వానీ చివరి ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. జులై 8 న చేసిన ట్వీట్ లో ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ కు ప్రజలు మద్దతు తెలుపాల్సిందిగా కోరాడు. లేకుంటే రానున్న రోజుల్లో ఖురాన్ ను చదవడం కూడా నిషేధించే అవకాశం ఉందని పోస్ట్ చేశాడు. Support Zakir Naik or Time Will Come When Qur’an Recitation will be Banned pic.twitter.com/pVfoSLnCEj — Burhan Bhai (@Gazi_Burhan2) 8 July 2016 కాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ జకీర్ నాయక్ పై దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. జులై 1 న ఢాకాలోని రెస్టారెంట్ లో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు జాకీర్ నాయక్ బోధనలతో ప్రభావితమయ్యారని నిర్ధారించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయనకు చెందిన పీస్ టీవీ ఛానల్ ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్లో బర్హన్ వానీ మృతి చెందిన అనంతరం ఆ రాష్ట్రంలో ఘర్షణలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. -
కలాం చివరి ట్వీట్..
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిట్టచివరకు వరకు దేశం పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు. కలాం మరణించే రోజు కూడా ట్వీట్ చేశారు. తుది శ్వాస విడవడానికి దాదాపు 8 గంటల ముందు కలాం తన బాధ్యతలను తెలియజేశారు. ఈ రోజు షిల్లాంగ్‌కు వెళ్తున్నానని, లివబుల్ ప్లానెట్ ఎర్త్ అంశంపై కోర్సు తీసుకోబోతున్నట్టు ట్వీట్ చేశారు. షిల్లాంగ్ కు వెళ్లిన కాసేపటికే కలాం తుది శ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతకు గురైన కలాం సోమవారం రాత్రి కన్నుమూశారు. Going to Shillong.. to take course on Livable Planet earth at iim. With @srijanpalsingh and Sharma. — APJ Abdul Kalam (@APJAbdulKalam) July 27, 2015