శ్రీదేవి చేసిన ఆఖరి ట్వీట్‌ ఇదే.. | Do You Know Sridevi last tweet? | Sakshi
Sakshi News home page

శ్రీదేవి చేసిన ఆఖరి ట్వీట్‌ ఇదే..

Published Sun, Feb 25 2018 5:13 PM | Last Updated on Mon, Feb 26 2018 12:59 PM

Do You Know Sridevi last tweet? - Sakshi

శ్రీదేవి ట్విటర్‌ పేజీ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, ముంబయి : ప్రముఖ సినీనటి శ్రీదేవి అకాల మరణం సినీలోకాన్నే కాకుండా యావత్‌భారతాన్ని తీవ్రశోకంలో ముంచెత్తింది. ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమెకు సంబంధించి ప్రతి అంశాన్ని నెట్టింట్లో వెతికి తెలుసుకుంటున్నారు. ఆసక్తికరమైన ప్రతి అంశాన్ని ఒడిసి పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె చనిపోవడానికి ముందు చివరిసారిగా చేసిన ట్వీట్‌ ఏమిటి అని శోధించగా శుక్రవారమే ఆమె ఆఖరి ట్వీట్‌ చేశారు. అది కూడా ఓ తమిళ సినిమాకు మంచి జరగాలని కోరుకుంటూ.

ఈ నెల (ఫిబ్రవరి) 23న ఆమె కాతాడి అనే చిత్ర బృందానికి ఆల్‌ దిబెస్ట్‌ చెప్పారు. అందులో భాగంగా ఆ చిత్ర ట్రైలర్‌ను తన ట్విటర్‌ ఖాతా ద్వారా ట్వీట్‌ చేశారు. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి కల్యాణ్‌ దర్శకత్వం వహించగా అవిశేక్‌ కార్తిక్‌, సాయి ధనిష్క, డానియెల్‌ అన్నీ పోప్‌ ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. తన వ్యవహారాలను చూసుకుంటూనే తన చుట్టూ ఉండేవారి మంచిని శ్రీదేవీ ఎప్పుడూ కోరుకుంటారని చెప్పేందుకు ఈ ట్వీట్‌ ఉదాహరణ అంటూ నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పటి వరకు శ్రీదేవి కొనసాగించిన తన ట్విటర్‌ ఖాతాను ఒకసారి పరిశీలిస్తే..
శ్రీదేవి ట్విటర్‌లో చేరిన సంవత్సరం : మే, 2012
స్టేటస్‌ : నటి-అమ్మ-గృహిణి-నటిగా మరోసారి
శ్రీదేవీ చేసిన ట్వీట్లు : 1,848
శ్రీదేవి ఎంతమందిని ఫాలో అయ్యారు : 64
శ్రీదేవిని ఫాలో అవుతున్నవారి సంఖ్య : 1.41 మిలియన్లు
ఆమె వివిధ ట్వీట్లకు చేసిన లైక్‌లు : 3,860
 

(శ్రీదేవి చేసిన చివరి ట్వీట్‌ ఫిబ్రవరి, 23, 2018)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement