'ఈ సమయంలో అలాంటి ట్వీట్‌ చేసేందుకు సిగ్గులేదా' | Congress Deletes Tweet That Said Sridevi Was Awarded Padma Shri By UPA | Sakshi
Sakshi News home page

'ఈ సమయంలో అలాంటి ట్వీట్‌ చేసేందుకు సిగ్గులేదా'

Published Sun, Feb 25 2018 4:16 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress Deletes Tweet That Said Sridevi Was Awarded Padma Shri By UPA - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సినీ నటి శ్రీదేవీ అకాలమరణంపై కాంగ్రెస్‌ పార్టీ ఓ ట్వీట్‌ను చేసి వెంటనే తొలగించింది. ఆ ట్వీట్‌పై సోషల్‌ మీడియాలో వెంటనే విమర్శలు రావడంతో కొద్ది సేపటికే దానిని తొలగించి మరో ట్వీట్‌ చేసింది. ఇంతకు కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆ తొలి ట్వీట్‌ ఏమిటి ? ఎందుకు తొలగించాల్సి వచ్చిందంటే.. కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఆదివారం ఉదయం 10.20గంటలకు శ్రీదేవీ అకాల మరణంపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొనడమే కాకుండా.. ఆమె ఎప్పటికీ అందరి హృదయాల్లో నిలిచిపోతారని ట్వీట్‌ చేశారు.

అలాగే, ఆమెకు యూపీఏ ప్రభుత్వ హయాంలో 2013లో పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించామంటూ కూడా అందులో పేర్కొన్నారు. దీంతో సోషల్‌ మీడియాలో యూపీఏ ప్రభుత్వ హయాంలో పద్మశ్రీ ఇచ్చారని ఈ సమయంలో చెప్పుకోవడం అవసరమా అంటూ తీవ్రస్థాయిలో చర్చ రావడంతో వెంటనే కాంగ్రెస్‌ పార్టీ ఆ ట్వీట్‌ను తొలగించింది. వెంటనే శ్రీదేవీ పలు అవార్డులు సొంతం చేసుకున్నారని, అందులో పద్మశ్రీ అత్యున్నత అవార్డు అని, ఆరు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు వచ్చాయని, ఇలా పలు విషయాలు పేర్కొంటూ మరో ట్వీట్‌ చేసింది. అయితే, సోషల్‌ మీడియాలో మాత్రం ఓ వ్యక్తి చనిపోయిన సమయంలో రాజకీయాలు చేయడానికి సిగ్గు లేదా.. ఇప్పుడు అవార్డుల గురించి చెప్పడం అవి తామే ఇచ్చామంటూ చెప్పుకోవడం అవసరమా అంటూ తీవ్రంగా నెటిజన్లు విమర్శిస్తున్నారు.  

(కాంగ్రెస్‌ పార్టీ తొలిసారి చేసిన ట్వీట్‌ )
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement