సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ నటి శ్రీదేవి(54) హఠాన్మరణం భారత ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ.. సినీ, రాజకీయ, క్రీడా రంగాల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమెతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళులర్పిస్తున్నారు. ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఓ ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ‘శ్రీదేవి ఇకలేరు అనే వార్త వినడానికి చింతిస్తున్నాం. ఆమె ఒక ఉత్తమ నటి. భౌతికంగా దూరమైనా.. సీనీతారగా మా మదిలో చిరస్థాయిగా నిలచిపోయారు. ఆమెకు మా ఘననివాళులు. 2013 యూపీఎ హయాంలోనే శ్రీదేవి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.’ అని ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్‌లో కాంగ్రెస్ ‘యూపీఏ హయాంలో పద్మశ్రీ అవార్డు’ అని ప్రస్తావించడాన్ని తప్పుబడుతూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ దిగ్గజ నటి మరణాన్ని కూడా రాజకీయం చేస్తోంది.. యూపీఎ హయాంలో అని ప్రస్తావిస్తే మీకొచ్చిన ఉపయోగం ఏమిటి..’ అని ఒకరు.. కాంగ్రెస్ హయాంలో అవార్డు అందుకున్నారని ప్రస్తావిస్తూ నివాళులు అర్పించడం సరైనదేనా? ఇలాంటి పనులు ఆపండి.. షేమ్ కాంగ్రెస్ అని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. ‘శ్రీదేవికి పద్మశ్రీ ఇచ్చారని కాంగ్రెస్‌కు ఓటేయ్యమని అడుగుతారా.? ఎంటని’ మరోకొరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శలతో కాంగ్రెస్ ఆ ట్వీట్‌ను తొలిగించింది.
కాంగ్రెస్ తొలిగించిన ట్వీట్ స్ర్కీన్ షాట్
Comments
Please login to add a commentAdd a comment