kaathadi
-
శ్రీదేవి చేసిన ఆఖరి ట్వీట్ ఇదే..
సాక్షి, ముంబయి : ప్రముఖ సినీనటి శ్రీదేవి అకాల మరణం సినీలోకాన్నే కాకుండా యావత్భారతాన్ని తీవ్రశోకంలో ముంచెత్తింది. ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమెకు సంబంధించి ప్రతి అంశాన్ని నెట్టింట్లో వెతికి తెలుసుకుంటున్నారు. ఆసక్తికరమైన ప్రతి అంశాన్ని ఒడిసి పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె చనిపోవడానికి ముందు చివరిసారిగా చేసిన ట్వీట్ ఏమిటి అని శోధించగా శుక్రవారమే ఆమె ఆఖరి ట్వీట్ చేశారు. అది కూడా ఓ తమిళ సినిమాకు మంచి జరగాలని కోరుకుంటూ. ఈ నెల (ఫిబ్రవరి) 23న ఆమె కాతాడి అనే చిత్ర బృందానికి ఆల్ దిబెస్ట్ చెప్పారు. అందులో భాగంగా ఆ చిత్ర ట్రైలర్‌ను తన ట్విటర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి కల్యాణ్ దర్శకత్వం వహించగా అవిశేక్ కార్తిక్, సాయి ధనిష్క, డానియెల్ అన్నీ పోప్ ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. తన వ్యవహారాలను చూసుకుంటూనే తన చుట్టూ ఉండేవారి మంచిని శ్రీదేవీ ఎప్పుడూ కోరుకుంటారని చెప్పేందుకు ఈ ట్వీట్ ఉదాహరణ అంటూ నెటిజన్లు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు శ్రీదేవి కొనసాగించిన తన ట్విటర్ ఖాతాను ఒకసారి పరిశీలిస్తే.. శ్రీదేవి ట్విటర్లో చేరిన సంవత్సరం : మే, 2012 స్టేటస్ : నటి-అమ్మ-గృహిణి-నటిగా మరోసారి శ్రీదేవీ చేసిన ట్వీట్లు : 1,848 శ్రీదేవి ఎంతమందిని ఫాలో అయ్యారు : 64 శ్రీదేవిని ఫాలో అవుతున్నవారి సంఖ్య : 1.41 మిలియన్లు ఆమె వివిధ ట్వీట్లకు చేసిన లైక్‌లు : 3,860 (శ్రీదేవి చేసిన చివరి ట్వీట్ ఫిబ్రవరి, 23, 2018) Wishing the cast and crew of Kaathadi all the very best! @avishekactor @saidhansika https://t.co/MeKT4Uu33P — SRIDEVI BONEY KAPOOR (@SrideviBKapoor) 23 February 2018 -
పోలీస్ ఆఫీసర్‌గా ధన్సిక
కబాలి చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించిన ధన్సిక తాజాగా కాత్తాడి అనే చిత్రంలో పవర్ఫుల్ పోలీస్అధికారిణిగా రఫ్ ఆడిస్తున్నారు. గ్యాలక్సీ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం కాత్తాడి. ఈ చిత్రం ద్వారా అతిలోక సుందరి శ్రీదేవి పిన్ని కొడుకు, నటి మహేశ్వరి సోదరుడు అభిషేక్ కథానాయకుడిగా నటిస్తున్నారు. కథానాయకిగా నటి ధన్సిక నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రలో సంపత్, జాన్‌విజయ్, మనోబాలా, కోటాశ్రీనివాసరావు, వీఎస్.రాఘవన్, కాళీవెంకట్, సుమార్మూంజి కుమార్ డేనియల్, నాన్‌కడవుల్ రాజేంద్రన్, పసంగ శివకుమార్, లొల్లుసభ మనోహర్, వినోదిని, మధుమిత, సూపర్‌గుడ్ సుబ్రమణి చరణ్‌రాజ్ నటిస్తున్నారు. డి. ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని ఎస్.కల్యాణ్ నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు కథ సొల్లపోరోమ్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. తాజా చిత్రం కాత్తాడి గురించి దర్శకుడు కల్యాణ్ తెలుపుతూ ఇది వినోదం మేళవించిన యాక్షన్ కథా చిత్రం అని తెలిపారు. ప్రముఖ వ్యాపారవేత్త సంపత్ కూతురు చైతన్యను దొంగలైన హీరో అవినేష్, సుమార్ మూంజి కుమార్ డేనియల్ కిడ్నాప్ చేస్తారన్నారు. వారి నుంచి పోలీస్ అధికారిణి ధన్సిక ఆ పాపలు ఎలా కాపాడిందన్నదే చిత్ర కథ అని తెలిపారు. తన తొలి చిత్రం కథై సొల్లపోరోమ్ చిత్రం విజయం సాధించడానికి ప్రధాన కారణం అందులోని సెంటిమెట్నేననీ అన్నారు. ఈ చిత్రంలోనూ అది సన్నివేశాలకు తగ్గట్టుగా ఉంటుందన్నారు. చిత్రం బాగా నచ్చడంతో కథ సొల్లపోరోమ్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసిన లిప్పీ సినీ క్రాఫ్ట్స్ రంజిత్‌కుమార్ ఈ చిత్ర విడుదల హక్కుల్ని పొందారని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.