పోలీస్ ఆఫీసర్గా ధన్సిక | dansika power full police officer in kaathadi | Sakshi
Sakshi News home page

పోలీస్ ఆఫీసర్గా ధన్సిక

Published Sun, May 29 2016 3:00 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

పోలీస్ ఆఫీసర్గా ధన్సిక - Sakshi

పోలీస్ ఆఫీసర్గా ధన్సిక

కబాలి చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించిన ధన్సిక తాజాగా కాత్తాడి అనే చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్‌అధికారిణిగా రఫ్ ఆడిస్తున్నారు. గ్యాలక్సీ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం కాత్తాడి. ఈ చిత్రం ద్వారా అతిలోక సుందరి శ్రీదేవి పిన్ని కొడుకు, నటి మహేశ్వరి సోదరుడు అభిషేక్ కథానాయకుడిగా నటిస్తున్నారు. కథానాయకిగా నటి ధన్సిక నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రలో సంపత్, జాన్‌విజయ్, మనోబాలా, కోటాశ్రీనివాసరావు, వీఎస్.రాఘవన్, కాళీవెంకట్, సుమార్‌మూంజి కుమార్ డేనియల్, నాన్‌కడవుల్ రాజేంద్రన్, పసంగ శివకుమార్, లొల్లుసభ మనోహర్, వినోదిని, మధుమిత, సూపర్‌గుడ్ సుబ్రమణి చరణ్‌రాజ్ నటిస్తున్నారు. డి. ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని ఎస్.కల్యాణ్ నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు కథ సొల్లపోరోమ్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. తాజా చిత్రం కాత్తాడి గురించి దర్శకుడు కల్యాణ్ తెలుపుతూ ఇది వినోదం మేళవించిన యాక్షన్ కథా చిత్రం అని తెలిపారు. ప్రముఖ వ్యాపారవేత్త సంపత్ కూతురు చైతన్యను దొంగలైన హీరో అవినేష్, సుమార్ మూంజి కుమార్ డేనియల్ కిడ్నాప్ చేస్తారన్నారు.

వారి నుంచి పోలీస్ అధికారిణి ధన్సిక ఆ పాపలు ఎలా కాపాడిందన్నదే చిత్ర కథ అని తెలిపారు. తన తొలి చిత్రం కథై సొల్లపోరోమ్ చిత్రం విజయం సాధించడానికి ప్రధాన కారణం అందులోని సెంటిమెట్‌నేననీ అన్నారు. ఈ చిత్రంలోనూ అది సన్నివేశాలకు తగ్గట్టుగా ఉంటుందన్నారు. చిత్రం బాగా నచ్చడంతో కథ సొల్లపోరోమ్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసిన లిప్పీ సినీ క్రాఫ్ట్స్ రంజిత్‌కుమార్ ఈ చిత్ర విడుదల హక్కుల్ని పొందారని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement