
పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణం కేవలం పునీత్ కుటుంబ సభ్యులనే కాదు కన్నడిగులను, భారత సినీ పరిశ్రమ సైతం విషాదంలోకి నెట్టింది. ఆయన మరణించిన రోజు సినీ పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు పునీత్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. ఇక పునీత్ మరణించ రెండు వారాలు దగ్గరపడుతున్నాయి.
చదవండి: పునీత్ మృతికి రజనీ సంతాపం, కన్నింగ్ ఫెలో అంటూ విమర్శలు
ఈ నేపథ్యంలో తొలిసారిగా ఆయన అన్నయ్య, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పునీత్ అకాల మరణంతో తమ కుటుంబంలో నెలకొన్న పరిస్థితుల గురించి వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక పునీత్ మరణించిన రోజు ఆసక్తికర సంఘటన చోటుచేసుకుందని, ఆ రోజు అక్కడికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన దగ్గరికి వచ్చి ‘మీకు నేను ఉన్నా అన్న’ అంటూ ధైర్యం చెప్పారని ఈ సందర్భంగా శివరాజ్ చెప్పారు.
చదవండి: Upasana: ‘నా బెస్ట్ ఫ్రెండ్ ఓ ట్రాన్స్‌జెండర్.. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను’
అలాగే ఎన్టీఆర్‌పై తనకు ఉన్న అనుబంధం, అభిమానంను శివ రాజ్కుమార్ తెలియజేశారు. కాగా ఎన్టీఆర్‌కు కన్నడ ఇండస్ట్రీతో మంచి సంబంధాలు ఉన్నాయి. పునీత్ రాజ్ కుమార్ కోసం ఎన్టీఆర్ ఆయన సినిమాలో ఒక పాట పాడి కన్నడిగులను తన గొంతుతో ఆకట్టుకున్నారు. ఈ పాట తర్వాత పునీత్, ఎన్టీఆర్‌ల మధ్య సన్నిహిత్యం మరింత బలపడింది. అంతేగాక ఎన్టీర్ తనకు బ్రదర్ లాంటి వాడంటూ పునీత్ గతంలో ఇచ్చిన పలు ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
"నేనున్నాను అన్నా మీకు" - ఎన్.టి.ఆర్
— MilagRRRo Movies (@MilagroMovies) November 11, 2021
శివరాజ్ కుమార్ @NimmaShivanna
గారిని పరామర్శించిన ఎన్.టి.ఆర్@tarak9999 @PuneethRajkumar pic.twitter.com/Qijeqlagc9