సాధారణంగా సెలబ్రిటీలు ఏ చిన్న విషయాన్నైనా సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటారు. ఈ లిస్టులో "కేజీఎఫ్" చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న కన్నడ స్టార్ హీరో యశ్ కూడా ఉన్నాడు. అయితే అక్టోబర్ 30న యశ్ దంపతులకు జన్మించిన కొడుకు ఫొటో మాత్రం ఇప్పటివరకు పంచుకోలేదు. అయితే ఇన్నాళ్ల తర్వాత ఆ ఆ బుడ్డోడిని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన సమయం ఆసన్నమైనట్లుంది. తన గారాల కొడుకు ఫొటోను కేజీఎఫ్ హీరో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కాగా అయితే అప్పటి నుంచి అతని ముఖాన్ని ఇంతవరకు చూపించనేలేదు. ఆరు మాసాల అనంతరం యశ్ దంపతులు బాబుతో కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "చిన్నోడికి హాయ్ చెప్పండి.. మీ ఆశీర్వచనాలు అందించడి" అని వారు పేర్కొన్నారు. (‘నాన్నా.. ఇది సమ్మర్ అని నాకు తెలుసు’)
ఎంతో క్యూట్‌గా ముద్దులొలుకుతున్న బాబును చూసి జూనియర్ యశ్ అదుర్స్ అంటూ కితాబిస్తున్నారు. ఇదిలా వుండగా యశ్ నటనపై పిచ్చితో రూ.300 తీసుకుని ఇంటి నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. టీ ఇవ్వడం నుంచి ప్రతీ పని చేస్తూ అవకాశం కోసం ఎదురు చూశాడు. అలా ఓరోజు స్టేజీపై ప్రదర్శన ఇస్తుండగా ఆయన ప్రతిభను గుర్తించి సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా సినిమాల్లో నటిస్తున్న సమయంలో రాధికతో ప్రేమలో పడి 2016లో ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాది వయసున్న కూతురు ఐరాతో పాటు ఆరు నెలల బాబు ఉన్నాడు. ఇప్పటివరకు ఆ చిన్నోడికి ఇంకా పేరు పెట్టలేదు(రెండోసారి తండ్రి అయిన స్టార్ హీరో)
Comments
Please login to add a commentAdd a comment