Kantara Hero Rishab Shetty Love Story Special on Valentines Day - Sakshi
Sakshi News home page

Rishab Shetty: ఈవెంట్‌లో పరిచయం.. ఫేస్‌బుక్‌ రిక‍్వెస్ట్.. రిషబ్ ప్రేమ కహానీ

Feb 14 2023 11:16 AM | Updated on Feb 14 2023 1:37 PM

Kantara Hero Rishab Shetty Love Story Special on Valentines Day - Sakshi

కన్నడ హీరో రిషబ్‌ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కాంతార సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు రిషబ్‌ శెట్టి. ఇక కాంతార మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఎలాంటి అంచనాలు లేకండా ప్రాంతీయ సినిమాగా వచ్చిన పాన్‌ ఇండియా స్థాయిలో కలేక్షన్స్‌ రాబట్టింది. కేవలం రూ. 15 కోట్లతో నిర్మించిన కాంతార ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో రిషబ్ శెట్టి గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆయన వ్యక్తిగత జీవితంపై పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. అయితేరి షబ్ శెట్టిది లవ్ మ్యారేజ్. ఆయన భార్య పేరు ప్రగతి.  ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా ఆయన ప్రేమ పెళ్లిపై ప్రత్యేక కథనం.

అభిమానితో ప్రేమ

సాధారణంగా హీరోలు తమ ఇండస్ట్రీలోని పరిచయమున్న వారితో ప్రేమలో పడట సహజం. కానీ అభిమానితో ప్రేమలో పడటం అంటే చాలా అరుదు. కానీ రిషబ్ శెట్టి జీవితంలో అదే జరిగింది. ఫేస్‌ బుక్‌ ద్వారా పరిచయమైన అమ్మాయితో ఆయన ప్రేమలో పడ్డారు. ఓ ఈవెంట్‌లో ఆమెను చూసిన మనసు పారేసుకున్నారు. ఆ తర్వాత ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నారట. ఓ ఈవెంట్‌లో 2016లో పరిచయమైన ప్రగతిని 2017లో వివాహం చేసుకున్నారు రిషబ్ శెట్టి.

వీరి ప్రేమ ఎలా మొదలైందంటే..

కిరాక్ పార్టీ ఫేమ్ రక్షిత్ శెట్టితో ఓ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. రిషబ్‌కు వీరాభిమాని అయిన ఆ ఈవెంట్‌కు వెళ్లింది. అక్కడే ఆమెను చూశారు రిషబ్. ఇంటికెళ్లి ఫోన్‌లో ఫేస్‌ బుక్ చూస్తే ఆ ‍అమ్మాయి రిక్వెస్ట్ పెట్టిందట. ఆమె రిక్వెస్ట్ ఏడాది తర్వాత చూసి యాక్సెప్ట్ చేశారట. ఇక అప్పటి నుంచి చాటింగ్, ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. 

పట్టుబట్టి మరీ ఒప్పించిన ప్రగతి

అయినా ప్రగతి ఇంట్లో వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. రిషబ్‌ జీవితంలో ఇంకా స్థిరపడలేదని వద్దని చెప్పారు. కానీ ప్రగతి పట్టుబట్టి మరీ కుటుంబ సభ్యులను ఒప్పించింది. ఆ తర్వాత 2017లో వీరి ప్రేమ పెళ్లి జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

రిషబ్ సినీ కెరీర్

రిషబ్ కెరీర్ విషయానికొస్తే ఫిల్మ్ డైరెక్షన్‌లో డిప్లొమా చేశారు. కన్నడ స్టార్ డైరెక్టర్ ఏమ్మార్ రమేశ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన నిర్మాత, దర్శకుడిగా రెండు చిత్రాలు చేస్తున్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement