Rishab Shetty Kantara Movie Team Blessed With Panjurli In Real Life, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Kantara Movie: రియల్ లైఫ్‌లో కాంతార క్లైమాక్స్.. వీడియో వైరల్

Published Fri, Jan 20 2023 6:26 PM | Last Updated on Fri, Jan 20 2023 7:30 PM

Rishab Shetty Kantara Movie Team Faced Climax Scene in Real Life  - Sakshi

కాంతార సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమా అయినా కేవలం దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. కన్నడ స్టార్ రిషబ్‌ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీలోని ప్రధానంగా వరాహం సాంగ్, క్లైమాక్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. కర్ణాటకలో ప్రాచీన సంప్రదాయమైన భూతకోల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఓ వీడియోను షేర్ చేసింది. 

రిషబ్‌శెట్టి, సప్తమి గౌడతోపాటు చిత్రబృందం సభ్యులు. హోంబలే నిర్మాతలు తులునాడులో పంజర్లీ ఉత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భూతకోల ఆడటం.. పంజర్లీ అతడిని ఆవహించడం లాంటి సన్నివేశాలను చిత్రబృందం దగ్గరుండి చూశారు. పంజర్లీ ఆవహించిన వ్యక్తి రిషబ్‌శెట్టిని ఆత్మీయంగా పట్టుకోవడం వీడియోలో కనిపించింది. 

ఆ వీడియోలో భూతకోల ఆడే వ్యక్తిని పంజుర్లి ఆవహించడం.. ఆ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. తెరపై చూపించిన భూతకోల సన్నివేశాలను నిజ జీవితంలోనూ రిషబ్ శెట్టి బృందం కనులారా వీక్షించింది. స్పెషల్‌ వీడియో షేర్‌ చేసిన నిర్మాణ సంస్థ.. కాంతార టీమ్‌తో కలిసి తాము నిజ జీవితంలో దైవానుగ్రహం పొందామని పేర్కొంది.

హోంబలే ఫిల్మ్స్ తన ట్విటర్‌ ఖాతాలో రాస్తూ..'ప్రకృతికి మనం లొంగిపోయి మనకు స్వేచ్ఛ, విజయాన్ని  ప్రసాదించిన దైవాన్ని ఆరాధించండి. కాంతార బృందం నిజ జీవితంలో దేవానుగ్రహాన్ని పొందింది.' అని పేర్కొంది. అయితే ఈ వీడియోలోని దృశ్యాలు సినిమా తీయడానికి కంటే ముందే జరిగినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement