Yash KGF Chapter 2 Trailer: Breaks Records, Crosses 109 Million Views In 24hrs - Sakshi
Sakshi News home page

KGF Chapter2 Trailer Record: రాఖీభాయ్ క్రేజ్‌.. వ్యూస్‌తో దుమ్మురేపుతున్న ట్రైలర్‌

Published Mon, Mar 28 2022 9:15 PM | Last Updated on Tue, Mar 29 2022 9:01 AM

KGF Chapter2 Trailer Breaks Records, Crosses 109 Million Views In 24hrs - Sakshi

కన్నడ స్టార్‌ హీరో యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్‌-2. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్‌14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ జోరు పెంచిన చిత్ర బృందం నిన్న(ఆదివారం) ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒక్కరోజులోనే ఈ ట్రైలర్‌ అన్ని భాషల్లో రికార్డుల మోత మోగిస్తుంది.

కేవలం 24గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్‌ వ్యూస్‌ను కొల్లగొట్టింది. ట్రైలర్‌కి కన్నడ భాషలో 18మిలియన్‌ వ్యూస్‌, తెలుగులో 20M,హిందీలో 51M, తమిళంలో 12M, మలయాళంలో 8మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. 'రికార్డ్స్‌.. రికార్డ్స్‌.. రికార్డ్స్‌.. రాఖీకి ఇది ఇష్టం ఉండదు, అందుకు తప్పించుకుంటాడు. కానీ రికార్డ్స్‌ రాఖీని ఇష్టపడతాయి. అందుకే వాటి నుంచి తప్పించుకోలేడు' అంటూ మేకర్స్‌ ట్వీట్‌ చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement