ఇంటికొచ్చి శుభాకాంక్షలు చెప్పండి : స్టార్ హీరో
శివాజీనగర: పుట్టినరోజును జరుపుకోవటానికి దుబారా ఖర్చులు చేయరాదని, నేరుగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేయాలని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఉపేంద్ర అభిమానులకు విన్నవించారు. పుట్టిన రోజంటూ అభిమానులు కేక్‌లకు, పూలదండలకు, ఫ్లెక్సీ బోర్డులకు డబ్బులు ఖర్చులు చేయరాదని ఉప్పి అన్నారు. తన ఇంటికి వచ్చి నేరుగా శుభాకాంక్షలు చెప్పవచ్చని ట్విట్టర్‌లో ఆహ్వానం పలికారు. ఈ నెల 18న ఉపేంద్ర పుట్టినరోజు. ఇటీవల పుట్టినరోజును జరుపుకున్న హీరో కిచ్చ సుదీప్.. అభిమానులు ఆడంబరాల కోసం కాకుండా ఆ సొమ్మును పేదల సహాయానికి ఉపయోగించాలని కోరారు. అదే రీతిలో ఉపేంద్ర కూడా స్పందించడం విశేషం.
For all my loving fans request not to spend money on cakes garlands and flex boards. Please come and meet me with your wishes on my birthday
— Upendra (@nimmaupendra) September 10, 2017