
టచ్ చేసి చూడు
నిడివి : 31 సె.,
హిట్స్ : 25,35,578
‘రాజా ది గ్రేట్’ హిట్ తర్వాత రవితేజా హుషారుగా ఉన్నాడు. అతడి రాబోయే సినిమా ‘టచ్ చేసి చూడు’ టీజర్ కూడా ఇంకా హుషారు కలిగిస్తోంది. ఈ టీజర్ పోస్టయిన రెండ్రోజుల్లోనే దాదాపు 25 లక్షల హిట్స్‌ను నమోదు చేసింది.
ఏదో అల్లర్లు జరుగుతున్న చోట, గుర్రాల మీద ఉన్న పోలీసులు వారిని అదుపు చేయడంలో విఫలమవుతూ ఉండగా రవితేజా ఒక మనిషిని గాల్లోకి ఎగురవేసి అల్లర్లు చేస్తున్న దుండగులపై విసిరేయడం ఈ టీజర్‌లో కనిపిస్తుంది. ఆగ్రహంగా సాహసంగా లెక్కలేనట్టుగా కనిపిస్తున్న రవితేజ లుక్స్ కూడా బాగున్నాయి. నల్లమోతు శ్రీనివాస్, వల్లభనేని వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు విక్రమ్ సిరికొండ దర్శకుడు. రాశీ ఖన్నా, సీరత్ కపూర్ తమ అందచందాలతో ఆకట్టుకోనున్నారు.
ఇంటర్ కేస్ట్ మేరేజ్
నిడివి : 11 ని. 14 సె.,
హిట్స్ : 2,74,576
భారతదేశంలో కులాల మధ్య పెళ్లిళ్ల విషయంలో వచ్చే అభ్యంతరాలను సబ్జెక్ట్స్‌కు అప్లై చేసి వినోదాత్మకంగా చెప్పిన షార్ట్ ఫిల్మ్ ‘ఇంటర్ కేస్ట్ మేరేజ్’. పోస్ట్ అయిన రెండు రోజుల్లోనే దాదాపు రెండున్నర లక్షల హిట్స్‌కు చేరుకుంది. ఇందులో అబ్బాయి పేరు ఫిజిక్స్. అమ్మాయి పేరు బయాలజీ. అబ్బాయి తండ్రి పేరు మేథ్స్. తల్లి పేరు తెలుగు. ప్రేమించుకున్న అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి తండ్రి దగ్గరకు వెళతారు.
ఫిజిక్స్‌కు, బయాలజీకి ఎప్పుడూ లంకె కుదరవనీ రెండూ వేరు వేరు క్యాస్ట్స్ అని అభ్యంతరం చెబుతాడు తండ్రి. పైగా ‘గ్రావిటీకి వ్యతిరేకం ఏమిటి?’ అని అమ్మాయిని ప్రశ్నిస్తాడు. ‘బోయపాటి’ అని సమాధానం చెబుతుంది అమ్మాయి. అలాంటి అమ్మాయిని నిరాకరించాల్సిందే అంటాడు తండ్రి. కాని ఏ మనిషి జీవితంలో అయినా ‘బయాలజీ’ ఉంటుందని స్నేహితుడు సర్దిచెప్పేసరికి తుట్టతుదకు అంగీకరిస్తాడు. సైన్స్ జార్గాన్‌ను వాడి హాస్యం తెప్పించడానికి ప్రయత్నించిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు డైరెక్టర్ మసాలా సందీప్. సరదాగా చూడదగ్గ షార్ట్‌ఫిల్మ్ ఇది. ‘చాయ్ బిస్కెట్’ సమర్పణ.
Comments
Please login to add a commentAdd a comment